Akhil : అక్కినేని అఖిల్.. నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేస్తున్నప్పటికీ మనోడికి సరైన సక్సెస్ రావడం లేదు. రీసెంట్‌గా ఏజెంట్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో మలయాళ స్టా్ర్ మమ్ముట్టి కీలకపాత్రలో నటించగా, ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. ఇందులో సిక్స్ ప్యాక్ బాడీతోపాటు.. మాస్ లుక్ లో కనిపించారు. కానీ ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది.
అఖిల్ చైల్డ్ ఆర్టిస్టుగానే సినీ ఎంట్రీ ఇచ్చాడు. సిసింద్రీ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే హీరోగా అఖిల్ సినిమా పేరుతోనే వెండితెరకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ విజయం సాధించలేకపోయింది. అనంతరం మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వంటి సినిమాలను చేశారు. ఇవేవీ సక్సెస్ కాలేదు. ఏజెంట్ తప్పక విజయం సాధిస్తుందని అనుకున్నారు. కాని ఏకంగా సినీ నిర్మాతే మా సినిమా ఫెయిల్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అసలు అఖిల్ సినిమాలకు ఏమైంది? అన్న చర్చ ప్రారంభమైంది.
అయితే తాజాగా అఖిల్ సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణం ఇదనేంటూ ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. నాగేశ్వర్ రావు నుంచి నాగ చైతన్య వరకు ప్రతీ పేరులో ‘నాగ’ వచ్చింది. అంటే నాగమ్మ దయతో తమ కుటుంబం చల్లగా ఉంటుందని భావించి అందరికి అలా పెట్టినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే అఖిల్ విషయానికొచ్చేసరికి మాత్రం నాగ కనిపించదు. అఖిల్ పేరులో నాగ లేకపోవడం వల్లే ఆయనకు సినీ కష్టాలు వస్తున్నాయని కొందరు అంటున్నారు. తన అన్న నాగ చైతన్య పెద్ద స్టార్ కాకపోయినా కొన్ని సినిమాలు అయితే కలిసి వచ్చాయి. అఖిల్‌కి అది కూడా లేదని దాని వల్లనే మనోడి కెరియర్ ముందుకు
సాగడం లేదని టాక్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…