Seetharamam : ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్ ఇటీవల తెగ వార్తలలో నిలుస్తూ వస్తుంది. ‘సీతారామం’ సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్‌గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్ మీద హొయలుపోయింది. సినీ అభిమానులతో పాటు ఫ్యాషన్ విమర్శకుల హృదయాలను గెలుచుకుంది. ఆమె కేన్స్ ఫెస్టివల్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం నానికి జంటగా ఓ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. నాని చిత్ర షూటింగ్ కోసం తరచుగా మృణాల్ ముంబై నుండి హైదరాబాద్ వస్తున్నారట.
అయితే ముంబై టూ హైదరాబాద్ చక్కర్లు కొట్టడం ఇబ్బందిగా భావించిన మృణాల్ ఓ లగ్జరీ హౌస్ కొన్నారట. అంతేకాదు త్వరలో ఆ ఇంటికి షిఫ్ట్ కానుందని కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఈ పుకార్లు మృణాల్ దృష్టికి వెళ్లగా ఆమె స్పందించారు. ఆ లగ్జరీ హౌస్ ఎక్కడో చెప్పండి. నేను కూడా ఒకసారి చూస్తాను అని సెటైరికల్ గా మాట్లాడారు. అంటే ఆమె పరోక్షంగా హైదరాబాద్ లో ఇల్లు కొన్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ప్రస్తుతానికి ఈ బ్యూటీ ముంబైలో ఉంటుంది. సినిమా షూటింగ్‌కి హైదరాబాద్ వచ్చినప్పుడు హోటల్‌లో ఉంటుంది.
మృణాల్ కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. లవ్ సోనియా మూవీతో ఆమెకు బ్రేక్ వచ్చింది. సూపర్ 30, బాట్లా హౌస్ చిత్రాలతో పాపులారిటీ రాబట్టారు. హిందీలో మృణాల్ వరుసగా చిత్రాలు చేస్తుండగా, ప్రస్తుతం ఆమె ఖాతాలో మూడు చిత్రాల వరకూ ఉన్నాయి. కెరీర్ బిగినింగ్ లో అనేక అవమానాలు పడ్డట్లు మృణాల్ చెప్పుకొచ్చారు. ఇక ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను మార్కెల్ సినిమాలకు పెద్ద అభిమానిని. ఆ సినిమాను ఎంతో ఇష్టంగా చూస్తాను. నేను ఏదో ఒక రోజు మార్వెల్ మూవీలో భాగం కావాలని ఆశిస్తున్నాను. భాగం అయ్యేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…