ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న 8 సినిమాలు ఇవే..!

2023లో టాలీవుడ్‌కు చ‌క్క‌టి ఆరంభం ద‌క్కింది. సాదార‌ణంగా టాలీవుడ్‌లో ప్ర‌తి ఏటా విజ‌యాల శాతం ప‌దికి మించ‌దు. ప్ర‌తి ఏడాది 150 నుంచి 200 వ‌ర‌కు సినిమాలు రిలీజైనా అందులో స‌క్సెస్‌లు సంఖ్య 20 నుంచి 30 మ‌ధ్య‌లోనే ఉంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. వ‌రుస‌గా విజ‌యాలు ద‌క్క‌డం అరుద‌నే చెప్పుకోవాలి. 2023 ప్రారంభంలో వ‌చ్చిన స్టార్ హీరోల సినిమాలు మంచి హిట్ అయ్యాయి. వాటిలో చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌, బాల‌య్య వీర‌సింహారెడ్డి కూడా ఉన్నాయి. చిరంజీవి, ర‌వితేజ హీరోలుగా న‌టించిన‌ వాల్తేర్ వీర‌య్య సినిమా 230 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.చిరంజీవి సినిమాకు పోటీగా రిలీజైన బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి కూడా వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బాల‌కృష్ణ కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాగా నిలిచింది.

అయితే కొంద‌రు హీరోలు వెరైటీ కాన్సెప్ట్స్‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచాల‌ని అనుకున్నారు. కాని అవి బెడిసికొట్టాయి. అందులో ముందుగా బింబిసార వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ చేయ‌గా, డోపుల్గాంగేర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా అల‌రించ‌లేక‌పోయింది.ఇక శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగ శౌర్య, మాళవికా నాయర్‌ జంటగా నటించిన ఫ‌లానా అబ్బాయిలు, ఫ‌లానా అమ్మాయిలు చిత్రం ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇక క్రియేటివ్ డైరెక్ట‌ర్ దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన `రంగమార్తాండ` చిత్రం కమర్షియల్‌గా సత్తాచాటలేకపోయింది. ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించారు.

these are the telugu movies flopped till now in 2023 year

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన మీట‌ర్ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. క‌లెక్షన్స్ విష‌యంలో చాలా దెబ్బ ప‌డింది. మంచి హిట్ కోసం కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ర‌వితేజ సుధీరవర్మ దర్శకత్వం లో రావ‌ణాసుర అనే చిత్రం చేయ‌గా, ఈ మూవీ నెగటివ్ టాక్ తో ప్లాప్ గా మారింది. ఇక య‌శోద వంటి హిట్ త‌ర్వాత స‌మంత న‌టించిన చిత్రం శాకుంత‌లం. గుణశేఖర్ దర్శకత్వం లో సమంత ప్రధాన పాత్రలో వచ్చిన పౌరాణిక చిత్రం శాకుంతలం మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక అక్కినేని హీరో అఖిల్.. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో చేసిన ఏజెంట్ చిత్రం ఎన్నో అంచనాల మధ్య వచ్చి మూవీ ప్లాప్ అయ్యింది.గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వం లో వచ్చిన మూవీ రామబాణం. రెగ్యులర్ స్టోరీ తో వచ్చి ప్లాప్ అయ్యింది. వీటితో పాటు డ‌బ్బింగ్ చిత్రాలైన కబ్జా, పాతు తల చిత్రాలు కూడా ప్లాప్ లిస్ట్ లోకి చేరాయి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago