సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులకి వినోదం పంచే చిత్రాలు ఎన్నో వస్తుంటాయి, వెళుతుంటాయి. కాని కొన్ని మాత్రం అలా గుర్తుండి పోతాయి. అలాంటి వాటిలో మొదటిగా చెప్పుకోవల్సి వస్తే ఫాల్ మూవీ. స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు అమ్మాయిలు 2000 అడుగులు ఎత్తు ఉన్న భవనం ఎక్కి ఇరుక్కు పోతారు. ఎలా బయపడ్డారు అనేదే స్టోరీ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ స్టోరీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మరో సినిమా మాలికాపురం. భాగమతి, యశోద వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు మలయాళ హీరో ఉన్నిముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మూవీ మాలికాపురం తెలుగులో అదే పేరుతో అనువాదమైంది. తెలుగు వెర్షన్‌ను థియేటర్లలో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది. తాజాగా ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. భక్తి ప్రధాన కథాంశంతో చిత్రం రూపొందింది.
తర్వాతి బెస్ట్ చిత్రం సెంబీ. ప్రముఖ లేడి కమెడీయన్ కోవై సరళ నటించిన తమిళ మూవీ ‘సెంబి’.. డిసెంబరు 30న రిలీజైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫిబ్రవరి 3 నుంచి ఈ మూవీ డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రభు సాల్మన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరో బెస్ట్ చిత్రం కొరమేను మూవీ. ఆనంద్ రవి, కిషోరి ధాత్రక్, హరీష్ ఉత్తమన్, శత్రు, రాజా రవీందర్ ప్రధాన పాత్రలలో దర్శకుడు శ్రీపతి కర్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో సినిమాలో మూడు ముఖ్య పాత్రలు కనిపిస్తాయి. మరి వాటిలో ముగ్గురు నటులు శత్రు, హరీష్ అలాగే ఆనంద్ రవిలు మంచి నటనను కనబరిచారు.
ఇక తర్వాతి చిత్రం ఇరట్ట.మలయాళం నుంచి లేటెస్ట్ గా వచ్చిన మరో సినిమా ఇరట్ట. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సినిమా చూసిన అందరు బాబోయ్ ఇదే సినిమా.. ఇదేం ట్విస్టులు అనేస్తున్నారు.రోహిత్ ఎం.జి కృష్ణన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో జోజు జార్జ్ డ్యుయల్ రోల్ లో నటించారు. అంజలి ఫిమేల్ లీడ్ గా చేశారు. మరో హిట్ చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమాలో నానారకాల జానర్స్ ఉండడం వల్ల ఒక టికెట్ కి నాలుగైదు చిన్న సినిమాలు చూసిన ఫీలింగొస్తుంది. దీనికి తోడు సీక్వెల్ కి కూడా గ్రౌండ్ సెట్ చేసుకుని ఎండ్ సీన్ పెట్టారు. చివరిగా రైటర్ పద్మభూషణ్. ఈ సినిమా ప్రతి ఒక్కరికి మంచి థ్రిల్ కలిగించింది. చిరు కూడా ఈ మూవీ క్యాస్ట్‌పై ప్రశంసలు కురిపించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…