సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో మంచి హిట్ చిత్రాలు ఉన్నాయి, అలానే ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమా అతిధి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో అతిపెద్ద ఫ్లాప్ గా మారింది.. మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా చాలా దారుణం అని ఇప్పటికి కూడా చాలా మంది చెబుతుంటారు. ఈ సినిమాను మహేష్ బాబు అనవసరంగా చేసాడు అని చాలా మంది ఇప్పటికి అనే వాళ్ళు ఉన్నారు. సినిమా కథ చాలా మందికి ఎక్కలేదు ఒకటి అయితే సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు ఇబ్బంది పెట్టాయి.
అనవసరంగా కథలో లేని పోనీ వి యాడ్ చేసి సినిమా చేసారు అని , అందుకే సినిమా ఫ్లాప్ అయింది అని అంటూ ఉంటారు. అయితే ఈ సినిమాలో సంగీతం మాత్రం సినిమాకు న్యాయం చేసింది అనే మాట స్పష్టంగా చెప్పవచ్చు. అతిథి సినిమా అప్పట్లోనే హై టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కగా, కొన్ని అనవసరమైన సీన్స్ పెట్టి మూవీ నిడివి మూడు గంటలు ఉండడం ప్రేక్షకులను నిరాశపరిచిందని చెప్పవచ్చు.క్లైమాక్స్ ప్రేక్షకులకి ఏ మాత్రం ఎక్కలేదు. ముఖ్యంగా చిన్న పాప చనిపోవడం చాలామంది అభిమానులను హర్ట్ చేసింది.అతిధి సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు ఆస్కారం ఉన్నా కానీ డైరెక్టర్ అది మిస్ చేశారు. దీనివల్ల ప్రేక్షకులకు కాస్త బోరింగ్ అనిపించింది.
మణిశర్మ అందించిన మ్యూజిక్ చాలా బాగుంటుంది కానీ సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేదు. ఇందులో ఒకే ఒక్క సాంగ్ సత్యం ఏమిటో అనేది కాస్త అలరించింది. అతిథి సినిమా తర్వాత మహేష్ బాబు కూడా చాలా జాగ్రత్త పడి ప్రయోగాల విషయం అనగానే కాస్త వెనక్కు తగ్గే వాతావరణం అయితే మనం చూసాం అనే చెప్పాలి. ఇప్పటికి మహేష్ బాబు లో ఆ భయం ఉంది. ఇటీవల వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…