ఇప్పుడు థియేటర్స్‌లో కన్నా ఓటీటీలోనే సినిమా సందడి ఎక్కువగా ఉంటుంది. థియేటర్ లో రిలీజైన కొద్ది రోజులకే ఓటీటీలో సినిమాలు వస్తుండడంతో ఓటీటీపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగకు థియేటర్లు మాత్రమే కాకుండా ఓటీటీలు సైతం సినిమాలు, సిరీస్ లతో కళకళలాడాయి. ఇప్పుడు డిజిటల్ వేదికపై ఈ వీకెండ్ కి మరోసారి సినిమాలు తమ జోరు చూపించనున్నాయి. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన తాజా సినిమా ‘పఠాన్’. ఈ చిత్రానికి ‘వార్’ లాంటి సూపర్ డూపర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీసిన సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్, స్పై ఫిల్మ్ గా ఈ సినిమా రూపొందింది. ఇందులో షారుఖ్ ఖాన్ గూఢచారిగా కనిపించనున్నారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు మెయిన్ రోల్ లో, మహేశ్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘హంట్’. భరత్ నివాస్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పోలీస్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా జనవరి 26న థియేటర్లలోకి రాబోతోంది. ఇక ఓటీటీల విషయానికి వస్తే .. నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరిమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన 18 పేజెస్ చిత్రం 23 డిసెంబర్ 2022న విడుదలైంది.ఈ సినిమాకి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఆహాలో జనవరి 27 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. హిందీ భాషా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం యాన్ యాక్షన్ హీరో. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ అయ్యర్ దర్శకత్వం వహించారు. ఇది జనవరి 27 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది.
మంచి రేటింగ్ పొందిన మలయాళ ఎంటర్‌టైనర్ సాటర్‌డే నైట్. మల్లు స్టార్ నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 27న డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. యాపిల్ టీవీ ఒరిజినల్ సిరీస్ ష్రింకింగ్ ఈ నెల 27 నుండి యాపిల్ టీవీ ప్లస్ లో ప్రసారం కానుంది. జాసన్ సెగెల్, జెస్సికా విలియమ్స్, హారిసన్ ఫోర్డ్ మరియు ఇతరులు ప్రధాన పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఇక వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు జీ5, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ తో పాటు ఇతర ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో విడుదల కానున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…