నందమూరి బాలకృష్ణ రీసెంట్‌గా వీరసింహారెడ్డి చిత్రంతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అదే రేంజ్‌లో విజయాన్ని అందుకుంది. ఇటీవల ఈ చిత్ర సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్ . ఈ వేడుకలో బాలయ్య ఫుల్ జోష్‌తో కనిపించారు.అదే సమయంలో అక్కినేని ఫ్యామిలీపై నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. దీంతో బాలయ్యపై సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యతిరేకత కూడా వచ్చింది. ఉద్దేశపూర్వకంగా అన్నారో లేక కావాలని అన్నారో అన్న విషయం పక్కన పెడితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్లతో హర్ట్ అయ్యారు. తాజాగా బాలయ్యకు హీరోలు నాగ చైతన్య, అఖిల్ ట్విట్టర్ వేదికగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
బాలకృష్ణ తమ తాత, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావును అగౌరవపరిచారంటూ నటులు నాగ చైతన్య, అఖిల్ అక్కినేని కలత చెందారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ లెజెండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావులపై అనూహ్యమైన వ్యాఖ్య చేశారు.”మా నాన్నగారి సమకాలీనులు, ఆ రంగారావు (ఎస్వీ రంగారావును ఉద్దేశించి), అక్కినేని తొక్కినేని, మరికొందరు ఉన్నారు అని మాట్లాడారు. తమ తాత గురించి బాలకృష్ణ అగౌరవంగా మాట్లాడినందుకు నాగ చైతన్య, అఖిల్ విచారం వ్యక్తం చేశారు. నాగ చైతన్య తన సోషల్ మీడియా హ్యాండిల్‌ను తీసుకొని.. లెజెండరీ నటుడిని అగౌరవపరచడం తమను కించపరచడమేనని అన్నారు.
నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్‌వి రంగారావు గారు తెలుగు సినిమాకి గర్వకారణం అని, వారిని అగౌరవపరచడం మనల్ని మనం కించపరచుకున్నట్లేనని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల్ అక్కినేని కూడా అదే ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదంపై నాగార్జున స్పందించలేదు. పాత సినిమాలకు సంబంధించిన చాలా విషయాలు చర్చించుకున్నామని చెప్పే క్రమంలో అక్కినేని పేరెత్తిన బాలయ్య దాంతో పాటు ‘తొక్కినేని’ అనే మాట వాడటంతో ఈ వీడియో వైరల్ అయిపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…