Jayasudha : ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి బోల్తా కొట్టింది. 2019 సాహో తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉండేవి. పీరిడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా ప్రభాస్‌కి భారీ నష్టాన్ని చేకూర్చింది. అయితే ఇందులో ప్రభాస్ పామిస్ట్ రోల్‌లో నటించాడు.ఆయన చెప్పినవి అన్ని నిజం అయ్యేవి. ఇక సీనియర్ నటీ జయసుధ జీవితంలో కూడా ఓ జ్యోతిష్కుడు చెప్పింది నిజమైందట. దీంతో ఈ సినిమాకి జయసుధకి సంబంధం ఉందని కొందరు ప్రచారం చేశారు.
జయసుధ తల్లిదండ్రులు జోగాబాయి, రమేష్. తల్లి జోగాబాయికి సినిమాల పట్ల ఆసక్తి ఉండడంతో కొన్ని సినిమాల్లో నటించింది. జయసుధకు సినిమాలంటే ఆసక్తి ఉండేది కాదట. పైగా 3 గంటల పాటు తలుపులు మూసేసిన థియేటర్ లో ఎవ్వరూ కూర్చొంటారని తల్లితో వాదించేదట. రమేష్ ఓ సారి ఫ్రెండ్స్‌తో కలిసి బెంగళూరు వెళ్లారట. అక్కడ జయానగర్‌లో బాగా జాతకాలు చెబుతారని పేరున్న ఓ రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఉండేవారట. ఆయన ఏం చెబితే అది జరిగేదని నమ్మేవారట. అయితే రమేష్ ఓ సారి ఆయన దగ్గరకు వెళ్లి జాతకం చూపించుకోగా, మీ పెద్దమ్మాయి పెద్ద నటి అవుతుంది. చాలా పాపులర్ అవుతుందని అన్నాడట. అయితే సినిమాలే ఇష్టం లేని జయసుధ ఎలా నటి అవుతుందని రమేష్ అనుకున్నాడట.
ఇక విజయనిర్మల రమేష్ కు సొంత చిన్నాన కూతురు. అంటే జయసుధకు మేనత్త.అయితే జయసుధకి చిన్న పాత్ర దొరకడంతో రమేష్ లేని సమయంలో వెళ్లింది. అయితే అవి మనకు ఎందుకు అని రమేష్ వారించారట. కాని కమిట్ అవ్వడంతో చేయకతప్పలేదు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమెకు మరొక రెండు ఆఫర్లు రావడం.. ఇలా వరుసపెట్టి ఆఫర్లు వస్తుండడంతో రమేష్ అవాక్కయ్యారట. భార్యను తీసుకుని బెంగళూరు వెళ్లి మళ్లీ ఆ జ్యోతిష్యుని కలిశారట. ఆయన చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుండడంతో రమేష్ కుమార్తె సినిమా అవకాశాల విషయంలో కాదనలేకపోయారు. చివరకు ఆమె పెద్ద స్టార్ అయిపోయింది. జయసుధ అసలు పేరు సుజాత కాగా, అప్పట్లో సుజాత అనే పేరున్న నటి ఉండడంతో రమేష్, నటుడు ప్రభాకర్‌రెడ్డితో చర్చించి ఆమె పేరు జయసుధ గా మార్చారు. ఇక ఆమె సహజనటిగా ఎంతో మంది ప్రేక్షకుల మనసులని గెలుచుకున్న విషయం మనందరికి తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…