Bavagaru Bagunnara : మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రాలలో బావగారు బాగున్నారా చిత్రం ఒకటి. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాకి నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. నాగబాబు నిర్మాణంలో రూపొందిన సినిమాలలో ఇదొక్కటే మంచి విజయం సాధించింది. పవన్ కళ్యాన్‌తో ఈ మెగాబ్రదర్ నిర్మించిన‘‘గుడుంబా శంకర్’’ కూడా అట్టర్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపైంది. రామ్ చరణ్‌తో తీసిన ఆరెంజ్ కూడా ఈ రకంగానే డిజాస్టర్ లిస్టులో చేరింది. ఇక తాను హీరోగా నటిస్తూ.. నిర్మించిన ‘కౌరవుడు’ కూడా ఫ్లాప్ లిస్టులోనే చేరింది.
ఈ రకంగా నాగబాబుకి బావగారు బాగున్నారా చిత్రం ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. 1998వ సంవత్సరంలో ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. సినిమాలో రంభ హీరోయిన్ గా నటించగా రెండవ హీరోయిన్ గా రచన నటించింది. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.ఆయన సంగీత సారథ్యంలో రూపొందిన ప్రతిపాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్రహ్మానందం కామెడీ కూడా కలిసొచ్చింది.మొత్తానికి అన్నీ కలిసి రావడంతో బావగారు బాగున్నారా చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.
అయితే దర్శకుడు జయంత్ ఈ సినిమా కోసం ముందు చిరంజీవిని కాకుండా పవన్ కళ్యాణ్‌ని అనుకున్నారట. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండడం వలన ఈ సినిమాకి నో చెప్పారట. దాంతో అదే కథని చిరంజీవి ముందు పెట్టగా, ఆయన ఒకే చేశారు. అలా చిరంజీవి ప్రధానపాత్రలో బావగారు బాగున్నారా సినిమా రూపొందింది. నాగబాబుకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…