Sai Pallavi : సాయి పల్లవి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఫిదా చిత్రంతో ఎంతగానో ఆకట్టుకున్న సాయి పల్లివి ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది . లేడి పవర్ స్టార్ అనే బిరుదు కూడా దక్కించుకుంది. ఇటీవల వరుసగా శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, గార్గి సినిమాలతో అలరించింది సాయి పల్లవి. కథ నచ్చి, అందులో కంటెంట్ ఉంటేనే సాయి పల్లవి ఓకే అనేది. సాయి పల్లవి మలయాళం అమ్మాయి అయినప్పటికీ రెండు మూడు సినిమాలతో ఆమె తెలుగమ్మాయి అనేంతలా గుర్తింపు తెచ్చుకుంది.
సాయి పల్లవికి పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ విషయంలో కూడా పెద్దగా అభ్యంతరాలు చెప్పదని టాక్. అయితే సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కంగనా రనౌత్ ముఖ్యపాత్రలో నటిచిన తమిళ సినిమా దామ్ దూమ్ లో సాయిపల్లవి కనిపిస్తుంది. ఇక ఈ సినిమా చేసిన సమయంలో సాయిపల్లవి వయసు కేవలం ఆరేళ్లనట. ఏదో టైం పాస్ కోసం ఈ సినిమా చేశానని చెప్పిన సాయి పల్లవి.. దీనిని డెబ్యూ మూవీగా అంగీకరించను అని చెప్పింది.
అయితే సాయి పల్లవి మీద ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. ఆ మధ్య డేట్స్ ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల నాని నేను లోకల్ సినిమాకు అకస్మాత్తుగా రెమ్యునరేషన్ పెంచినట్లు వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని నిర్మాత దిల్ రాజు చెప్పేశారు. ఇక సాయి పల్లవి ఒక సినిమా చేయడానికి ఒప్పుకుందంటేనే అందులో మినిమమ్ కంటెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆమెను చూసి సినిమాపై ఇంట్రెస్ట్ చూపించే జనాలు అనేకం. మిగతా హీరోయిన్లల గ్లామర్, స్కిన్ షోకి సాయి పల్లవి దూరంగా ఉంటుంది..ఎలాంటి పాత్ర అయిన తన పరిధి మేరకు మాత్రమే నటిస్తూ దూసుకుపోతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…