The Great Khali : ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లో రెజ్లింగ్ చేసిన దలిప్ సింగ్ రాణా మనందరికి తెలిసే ఉంటుంది.. అదేనండీ మన దేశానికే చెందిన ‘గ్రేట్ ఖలి’ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాడు. ది గ్రేట్ ఖలీ అంటే ఓ భారీ ఖాయం అందరి కళ్ళముందు ప్రత్యక్ష్యం అవుతుంది. ఈయన ప్రతిష్టాత్మక భారతీయ రెజ్లర్లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డబ్యూడబ్యూఈలో జాన్ సెనా, కేన్ వంటి వారిని ఓడించాడు. అయితే ఇప్పుడు రెజ్లింగ్ కంటే సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటారీయన. వివిధరకాల వీడియోస్ పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ ను అలరిస్తుంటారు.
ఆ మధ్య ఇటుకలు పగులకొట్టి స్టంట్ చేయడానికి సిద్దమైన ఖలీ ఆ తరువాత చేసందేంటో చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.. ఆ మధ్య వంట చేశాడు. ఇక తాజాగా సరదాగా క్రికెట్ ఆడాడు. ది గ్రేట్ ఖలీ ఇలా క్రికెట్ ఆడడంతో అందరు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఖలీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎప్పటికప్పుడు సరదా పంచుతూ నెటిజన్స్‌కి వినోదాన్ని పంచుతుంటాడు ఖలీ. ఆయన చేసే ప్రతి పని కూడా నెట్టింట వైరల్ అవుతుంటుంది.
కాగా ది గ్రేట్ ఖలీ 2000 సంవత్సరంలో తన రెజ్లింగ్ కెరీర్‌ని ప్రారంభించాడు CWE, WCW, NJPW, WWE వంటి రెజ్లింగ్ కంపెనీల్లో రెజ్లర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో 2007-08 మధ్య కాలంలో డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీవెయిట్ చాంపియన్ అయ్యాడు. ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్‌గా క్లాస్ ఆఫ్ 2021లో ఎంపికయ్యాడు. ఇక 2018 ఏప్రల్ 27న తన రెజ్లింగ్ కెరీర్ నుంచి రిటైర్ అయ్యాడు. కాగా ఖలీ తో సెల్ఫీలు దిగేందుకు ఎంతో ఉత్సాహంగా పోటీ పడుతుంటారు.ఆయన రిటైర్ అయిన కూడా ఎప్పుడు ఏదో ఒక విధంగా వార్తలలో నిలుస్తూనే ఉంటారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…