Chandra Babu : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. జైలు నుండి విడుదలైన తరవ్ఆత చంద్రబాబు నాయుడు హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం విడుదలైన చంద్రబాబు బుధవారం హైదరాబాదులోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనను ఏఐజీ వైద్యుల బృందం కలిసి ఆరోగ్య పరిస్థితిపై పరీక్ష చేసింది. ఓసారి ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని చంద్రబాబుకు డాక్టర్లు సూచించారు. దీంతో ఉదయం ఆయన ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు… ఆయన ఆసుపత్రిలో చేరితే బాగుంటుందని తెలిపారు. వైద్యుల సూచనతో చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.
హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుకు ఏఐజీ వైద్యులు తొలుత ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన అనంతరం ఆయనను ఆసుపత్రిలో చేరాలని సూచించారు. దాంతో ఆయన గురువారం సాయంత్రం ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఇవాళ ఆయనకు మరికొన్ని పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. చంద్రబాబు కోసం టీడీపీ మద్దతుదారులు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు వారందరికీ అభివాదం చేస్తూ కారెక్కి తన నివాసానికి వెళ్లిపోయారు.
ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. నాదెండ్ల మనహోర్‌తో కలిసి నిన్న మధ్యాహ్నం చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. జైలు నుంచి బెయిల్‌పై బయటికి వచ్చిన ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికలకు తెదేపా – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించేందుకు ఇరు పార్టీల అధినేతలు నిర్ణయించినట్టు సమాచారం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…