అక్కినేని నాగార్జునకి ఇటీవలి కాలంలో సక్సెస్ అనేది పెద్దగా పలకరించడం లేదు. బంగార్రాజు చిత్రంతో కాస్త అలరించిన నాగ్ రీసెంట్‌గా ఘోస్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం థియేటర్స్‌లో పెద్దగా అలరించింది లేదు. గాడ్ ఫాదర్‌తో పోటీ పడిన ఈ సినిమాకి నిరాశే ఎదురైంది. అయితే ఇప్పుడు నాగార్జున ది ఘోస్ట్ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో టాప్ ప్లేసులో ట్రెండ్ అవుతోందని తెలుస్తోంది. ఈ మేరకు నాగార్జున ట్వీట్ వేశాడు. దీంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. థియేటర్స్‌లో ఈ సినిమాని చూసే వారు కరువయ్యారు. ఇప్పుడు ఓటీటీలో ఎలా చూస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున ప్రవీణ్ సత్తారు కాంబోలో వచ్చిన ది ఘోస్ట్ సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్రవీణ్ సత్తారు తన స్టైల్లో తెరకెక్కించాడు. కానీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది.ఈ క్రమంలో ఘోస్ట్ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ సినిమాకు పోటీగా వచ్చింది. గాడ్ ఫాదర్‌కు అంతో ఇంతో పాజిటివ్ టాక్ రావడంతో మొదటి వారంలో ఘోస్ట్ ఊసే లేకుండాపోయింది. మంచి బజ్‌తో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటించారు.
ఈ రోజు ఇండియాలో ట్రెండ్ అవుతోన్న మొదటి చిత్రాల్లో ది ఘోస్ట్ టాప్ ప్లేస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఓటీటీ ప్రేక్షకులను మాత్రం ది ఘోస్ట్ బాగానే ఆకట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. ముందుగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌కు బదులు సోనాల్ చౌహాన్ నటించిన సంగతి తెలిసిందే. కాజల్ తన ప్రెగ్నెన్సీ మూలనా.. ది ఘోస్ట్ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ది ఘోస్ట్ సినిమాలో సోనాల్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. టోటల్ రన్‌లో ఈసినిమా రూ. 6.5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఈ సినిమా రూ. 21.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 16 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…