Thaneti Vanitha : పుంగనూరులో పోలీసులపై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసులో ఏ1 ఉన్న టీడీపీ ఇన్ ఛార్జ్ చల్లాబాబు నెలరోజుల తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులపై దాడి తర్వాత చల్లా బాబు పరారీలో ఉన్నాడు. తాజాగా తానే స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. ఈ దాడి ఘటన ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. కావాలనే అలజడి సృష్టించాలనే అలా చేసినట్లు వెల్లడించారు.పుంగనూరులో పోలీసులపై దాడికి సంబంధించి ఇప్పటివరకు పోలీసులు మొత్తం 110 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా మరో 63 మంది టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసి జడ్డి ముందు హాజరు పరిచే అవకాశం కూడా ఉంది. ఆగస్టు 1న పుంగనూరులో గొడవలు సృష్టించేందుకు ముందుగానే పథకం రచించినట్లు తెలిపారు.
అయితే తాజాగా ఈ ఘటనపై హొంమత్రి తానేటి వనిత స్పందించారు.రెడ కలర్ షర్ట్‌లు వేసుకొని రౌడీయిజం చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. పుంగనూరు ఘటనలో వాళ్ల రెడ్ మ్యాప్ ఎటు ఉంది, ఎటు వెళ్లారు. పోలీసులు చాలా సంయమనం పాటించారు. ఒకవేళ వాళ్లు లాఠీ చార్జ్ చేసి ఉంటే ప్రభుత్వం కొట్టించిందని సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. ప్రజలు వారిని చాలా గమనిస్తున్నారు. వారు ప్రజలకు ఏం చేస్తారు అనేది పక్కా ఐడియా ఉంది. ప్రజల నుండి స్పందన లేకపోవడంతో వారు మీడియాలో ఉండేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు. ప్రజలలో గొడవలు తెచ్చేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నారు తప్ప మరొకటి లేదు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
పుంగనూరు సంఘటనని సంఘటనను రెండు మీడియాలో ఎవరి యాంగిల్లో అవి అచ్చేసుకున్నాయి. అంతేకానీ జరిగింది ఏమిటనే విషయాన్ని జనాలకు అందించాలనే సోయిలేకుండా పోయింది. పుంగనూరులో పోలీసులే టార్గెట్ గా టీడీపీ అల్లరిమూకల, కిరాయి మూకల దాడులు జరిగాయి. అప్పటి దాడుల్లో 47 మంది పోలీసులకు పెద్ద గాయాలే అయ్యాయి. ఒక కానిస్టేబుల్ కు రెండు కళ్ళు దెబ్బతిన్నాయి. మూడు పోలీసు వాహనాలను దగ్ధంచేశాయి. చాలామంది పోలీసుల నుండి నెలరోజులు తప్పించుకుని తిరిగిన విషయం అందరికీ తెలిసిందే.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…