Raghava Lawrence : రాఘవ లారెన్స్ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తమిళంతో పాటు తెలుగులోను అలరించాడు. ఆయన మంచి నటుడే కాదు కొరియోగ్రాఫర్ తో పాటు సామాజిక చైతన్యం ఉన్న మంచి మనిషి. లారెన్స్ ఎప్పుడు కూడా ఎవరికి హాని చేయడు. తనవంతు సాయాన్ని నలుగురికి అందించాలనే తపన ఆయనలో ఎప్పుడు ఉంటుంది. ప్రస్తుతం రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో దర్శకుడు పి. వాసు తెరకెక్కించిన చిత్రం చంద్రముఖి2 . ఈ సినిమా 2004లో సూపర్ హిట్‌గా నిలిచిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు.. పాటలకు మంచి స్పందన వస్తోంది.
ఇటీవల చంద్రముఖి 2 ఆడియో లాంచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్‌లో ఓ బౌన్సర్‌కు స్టూడెంట్‌కు మధ్య గొడవ జరిగింది. ఓ స్టూడెంట్‌పై లారెన్స్ బౌన్సర్ చేయి చేసుకున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలిసిన రాఘవ లారెన్స్ వెంటనే సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ విషయంపై స్పందించడమే కాకుండా లారెన్స్ తన బౌన్సర్లపై మండి పడ్డాడు. అలాగే దాడికి గురైన వ్యక్తికి ఆయన క్షమాపణలు కూడా తెలియజేశాడు. అందరికి నమస్కారం. చంద్రముఖి 2 సినిమా ఆడియో లాంచ్ సందర్భంగా బౌన్సర్‌లలో ఒకరు కాలేజీ స్టూడెంట్‌తో గొడవకు దిగిన దురదృష్టకర సంఘటన గురించి నాకు ఇప్పుడే తెలిసింది. ముందుగా ఈ సంఘటన గురించి నాకు తెలియదు, ఆడియో లాంచ్ జరుగుతున్నప్పుడు ఈ ఘటన బయట జరిగింది.
నేను విద్యార్థులను ఎంతగా ప్రేమిస్తానో, వారు ఎదగాలని నేను ఎంతగా కోరుకుంటానో అందరికీ తెలుసు. నేను గొడవలకు చాలా దూరంగా ఉంటాను. మనం ఎక్కడికి వెళ్లినా ఆనందం, శాంతి ఉండాలని కోరుకుంటాను. కారణం ఏమైనప్పటికీ, ఎవరినైనా కొట్టడం ఖచ్చితంగా తప్పు. ముఖ్యంగా స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఇది జరగకూడదు. ఆడియో లాంచ్‌లో ఇలా జరగడంపై నేను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను. ఇక నుంచైనా బౌన్సర్‌లు ఇటువంటి కార్యకలాపాలలో పాల్గొనవద్దని నేను మనస్పూర్తిగా అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు.’ అంటూ లారెన్స్ తెలియజేశాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…