Ravinder : చిక్కుల్లో మ‌హాల‌క్ష్మీ భ‌ర్త‌.. రవీందర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Ravinder : మ‌హాల‌క్ష్మీతో పాటు ఆమె భ‌ర్త కూడా చాలా ఫేమ‌స్. అందుకు కార‌ణం వారిద్దరి పెళ్లి. అందంగా ఉన్న మ‌హాల‌క్ష్మీ బాగా బ‌రువు ఉన్న నిర్మాత ర‌వీందర్ చంద్ర‌శేఖ‌ర్‌ని వివాహం చేసుకుంది. వీరి పెళ్లి పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్‌కాగా, ఈ జంట‌పై ప‌లువురు ట్రోల్స్ కూడా చేశారు. అయితే ఎవ‌రు ఎన్ని అన్నా కూడా వీరిద్ద‌రు మాత్రం చాలా అన్యోన్యంగా క‌లిసి ఉంటున్నారు అయితే తాజాగా మ‌హాల‌క్ష్మీ భ‌ర్త మోసపూరిత ఆర్ధిక కార్యక్రమాలకు పాల్పడ్డ కేసులో.. పోలీసుల అదుపులో ఉన్నాడు. చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ రవీందర్‌ను అరెస్ట్ చేసింది. ఓ వ్యాపారవేత్తను మోసం చేయడం.. ఆర్ధిక నేరాలకు పాల్పడిన కేసులో.. చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

ఘన వ్యర్థాల ఉంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను పెట్టి బోల్డన్నీ లాభాలు గడించవచ్చని రవీందర్‌ చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని న‌మ్మించి మోసం చేసిన‌ట్టు టాక్. నకిలీ పత్రాలను సృష్టించి. బాలాజీని ఈ ప్రాజెక్టులో భాగస్వామిని చేశాడు. ఇందుకోసం ఆయన దగ్గర నుంచి 15.83 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు అభియోగాలు ఉన్నాయి. అంతే కాదు వీరిద్దరి మధ్య 2020, సెప్టెంబర్‌17 ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. ఒప్పందంలో ఉన్న విధంగా జరక్కపోవడం.. రవీందర్‌ చెప్పినవి ఏవీ చేయకపోవడంతో.. డబ్బు తిరిగి ఇచ్చేయమని బాలాజీ ఎన్నిసార్లు అడిగినా రవీందర్‌ నుంచి సరైన జవాబు రాలేద‌ట‌. దీంతో ర‌వీంద‌ర్‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భావించాడు.

police arrested mahalakshmi husband ravinder for this
Ravinder

రవీందర్‌ చేసిన మోసపూరిత కార్యకలాపాలతో పాటు ఆర్ధిక అవకతవకలను వివరిస్తూ చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో కంప్లయింట్‌ చేశారు. బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దీంతో రవీందర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ఇక లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తమిళంలో రవీందర్‌ చాలా సినిమాలు చేసిన విష‌యం తెలిసిందు. గ‌త ఏడాదే బుల్లితెర నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. రవీందర్‌ చంద్రశేఖర్‌ ఇదివరకే చాలా వివాదాలలో చిక్కుకుని ఉన్నాడు. గతంలో విజయ్‌ అనే తన ఫ్రెండ్‌ దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు తీసుకుని, ఓ సినిమా నిర్మాణంలో భాగస్వామిని చేస్తానని నమ్మించి మోసం చేసిన‌ట్టు కూడా అత‌నిపై కేసు ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

23 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago