CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటన కొనసాగుతున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం జగన్, భారతి దంపతులు శనివారం రాత్రి 9.30 గంటలకు లండన్ బయలుదేరి వెళ్లారు. అక్కడ చదువుకుంటున్న తమ పిల్లలను కలిసేందుకు ఈ దంపతులు ఇద్దరు వెళ్లగా, లండన్ నుంచి తిరిగి ఈ నెల 12న వస్తారు.. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.అయితే సీబీఐ కోర్టు ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. . ఈ ఏడాది సెప్టెంబర్ 2 నుండి 12వ తేదీ వరకు జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కుటుంబ సమేతంగా యూకే పర్యటనకు వెళ్లారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో సీఎం జగన్ విదేశీ పర్యటన ఖరారైంది.
తన కుమార్తె హర్షా రెడ్డి స్నాతకోత్సవానికి హాజరయినట్టు తెలుస్తుండగా, స్నాతకోత్సవం కార్యక్రమంలో జగన్ సతీసమేతంగా పాల్గొన్నారు. కూతురు సాధించిన ప్రతిభ పట్ల జగన్ చాలా హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది. నీకు దేవుడు అంతా మంచి చేయాలని కోరుకుంటున్నా అని జగన్ అన్నారు. ఇక ప్రస్తుతం జగన్ తన ఫ్యామిలీతో కలిసి చాలా సందడిగా టూర్ వేస్తున్నారు. జగన్ టూర్ పిక్స్ మాత్రం ఏవి బయటకు రావడం లేదు. కూతురితో కలిసి ఆయన సరదాగా గడుపుతున్నట్టు తెలుస్తుంది.
సీఎం జగన్ టూర్ చుట్టూ రాజకీయ కోణం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తన కుమార్తెను చూసేందుకు వెళ్తున్నానంటూ సీబీఐ కోర్టులో అనుమతి తీసుకుని జగన్ యూకే వెళ్లారు. అయితే ఇప్పుడు జగన్ యూకే పర్యటనలో గండికోట రహస్యం దాగి ఉందని వార్తలు వస్తున్నాయి. అక్కడ కేమ్యాన్ ఐలాండ్స్ బ్యాంక్ ప్రతినిధులతో జగన్ సమావేశం అవుతున్నారని సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏబీఎన్ లైవ్‌లో ఆరోపించారు. ప్రస్తుతం ప్రత్యేక స్వయం ప్రతిపత్తి దేశంగా కేమ్యాన్ ఐలాండ్స్ ఉంది. అంతేకాకుండా ప్రపంచానికి ఫైనాన్షియల్ సెంటర్‌గా కూడా కేమ్యాన్ ఐలాండ్స్ వ్యవహరిస్తోంది. పశ్చిమ కరేబియన్ సముద్రంలో ట్యాక్స్ ఫ్రీ దేశంగా కేమ్యాన్ ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఐల్యాండ్‌లో నగదు నిల్వ చేయాలంటే ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. దీంతో వ్యక్తిగతంగా ఎంత డబ్బు అయినా ఈ బ్యాంక్‌లో దాచుకునే సౌకర్యం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ యూకే పర్యటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…