Aditi Govitrikar : త‌మ్ముడు ఫేమ్ ల‌వ్‌లీ.. ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా..?

Aditi Govitrikar : సినిమా ఇండస్ట్రీ అనేది కొత్త రంగుల కళా ప్రపంచం.. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరి స్థానం పర్మినెంట్ గా ఉంటుంద‌నేది చెప్ప‌లేదం. ఇందులో రాణించాలంటే అందం, నటనా అభినయంతో పాటుగా టాలెంట్ కూడా చాలా ఉండాలి. ఒక్కోసారి ఎంత అందం ఉన్న అదృష్టం లేకపోతే రాణించడం కష్టం. ఏ ఇండస్ట్రీ అయినా సరే పాతవారు వెళుతుంటే కొత్తవారు వస్తూనే ఉన్నారు. అయితే 1999లో బ్లాక్ బస్టర్ సినిమాతో డెబ్యూ చేసిన హీరోయిన్.. ఆ ఒక్క సినిమా తర్వాత తెలుగులో కనిపించకుండా క‌నుమ‌రుగు అయింది. మ‌రి ఆ హీరోయిన్ ఎవ‌రు అనే క‌దా మీ డౌట్.. అదితి గోవత్రికర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ సినిమాతో డెబ్యూ చేసింది.

త‌మ్ముడు సినిమాలో ప్రీతి జింగానియా కాకుండా.. లవ్లీ క్యారెక్టర్ చేసిన అమ్మాయి అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె అదితి గోవత్రికర్. ఈ చిత్రంలో వయ్యారి భామ నియంస నడక అనే పాట అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. తమ్ముడు సినిమా అనగానే.. పవన్ కళ్యాణ్, ప్రీతీలతో పాటు లవ్ లీ క్యారెక్టర్ ని ఎప్పటికీ మర్చిపోలేరనే చెప్పాలి.అదితి తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా.. ఇంపాక్ట్ మాత్రం బాగానే క్రియేట్ చేసింది. మహారాష్ట్రలోని పన్వేల్ ఏరియాలో పుట్టిపెరిగిన అదితి.. చిన్న వయసులోనే మోడలింగ్ లో అడుగుపెట్టింది.

thammudu movie actress Aditi Govitrikar see how is she now
Aditi Govitrikar

తెలుగులో తమ్ముడు సినిమాతో యాక్టింగ్ కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితమైంది.. ఇక సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే మెడిసిన్ పూర్తిచేసిన అదితి కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ముజఫర్ అనే వ్యక్తితో ఏడేళ్లు డేటింగ్ చేసి, 1998లో అతన్ని వివాహం చేసుకుంది.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా.. ఆ తర్వాత 2009లో వివిధ కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు… పెళ్లి తర్వాత కూడా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆదితి.. తాజాగా వెబ్ సిరీస్, టీవీ షోలలో మెరుస్తోంది.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అదితిని చూసిన ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago