Pooja Hegde : సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వందల వార్తలు హాల్‌చల్ చేస్తుంటాయి. ఇందులో సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు చూస్తే నమ్మడం కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ . బుట్టబొమ్మ పూజా హెగ్డే సీక్రెట్ ప్రేమాయణం నడుపుతున్నారని, ప్రస్తుతం వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, వీలైనంత ఎక్కువ సమయాన్ని కలిసి గడుపుతున్నారని.. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్,అత్యంత వివాదాస్పద సినీ విమర్శకుడినని చెప్పుకునే ఉమైర్ సంధు.. ట్విట్టర్ ద్వారా బ్రేకింగ్ న్యూస్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ప్రేమాయణం వలన సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ పూజకు మరో రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఈ విషయం సల్మాన్ కు అంత్యంత సన్నిహిత వర్గాల నుంచి తనకు తెలిసిందని చెప్పారు.
అయితే ఉమైర్ సింధు ట్వీట్‌పై పలువరు పలు రకాలుగా తమ అభిప్రాయాలని వ్యక్తపరుస్తున్నారు. ఉమైర్ సంధు మాటలను అస్సలు నమ్మలేం. గతంలో ఇలాంటి వివాదాస్పద ట్వీట్లు ఉమైర్ సంధు చాలానే చేశాడు. కానీ, వాటిలో నిజమైనవి చాలా తక్కువ. ఇండియన్ మూవీస్‌కి రివ్యూలు ఇచ్చే ఉమైర్ సంధు.. గతంలో చాలా తెలుగు సినిమాలకు కూడా సమీక్ష చేయగా, ఈయన 5 స్టార్లు ఇచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లుగా నిలిచచాయి. మనోడు చెత్తగా ఉందన్న సినిమాలు బ్లాక్ బస్టర్లు అయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ మధ్యనే.. కృతి సనన్, ప్రభాస్ ప్రేమలో ఉన్నారని బాంబ్ పేల్చిన ఉమైర్ .. ఇప్పుడు 32 ఏళ్ల పూజా హెగ్డేతో 56 సంవత్సరాల సల్మాన్ ఖాన్‌కు లింక్ పెట్టాడు.
ఈ క్రమంలో నెగిటివ్ కామెంట్స్‌తో అతనికి కౌంటర్ ఇస్తున్నారు. సల్మాన్ ఖాన్ వయసు ఏంటి..? పూజ హెగ్డే వయసు ఏంటి..? ఇదేక్కడి లింక్ రా బాబు అంటూ తిట్టిపోస్తున్నారు. మరికొందరైతే మా గురూజీ (త్రివిక్రమ్) ఏమైపోవాలి రా.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. వారిద్దరిది ప్రేమ కాదని.. ఈ ట్వీట్ ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమా ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ లో పూజా హెగ్డే నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పర్హాద్ సాంజీ దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై సల్మాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో రాఘవ్ జుయాల్, జస్సీ గిల్, సిద్ధార్థ్ నిగమ్, షెహనాజ్ గిల్, పాలక్ తివారి, మాళవిక శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదల కానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…