Panchatantram Movie Review : పంచ‌తంత్రం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Panchatantram Movie Review : కామెడీ బ్రహ్మ డాక్టర్‌ బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ చిత్రం పంచతంత్రం . టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌రదన్‌, సృజ‌న్ ఎర‌బోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష పులిపాక ద‌ర్శకత్వం వ‌హించ‌గా, ఈ చిత్రం నేడు గ్రాండ్‌గా రిలీజ్ అయింది. మ‌రి సినిమా ఎలా ఉందో చూద్దాం.

క‌థ‌:

ఐదు క‌థ‌ల స‌మాహారంగా పంచ‌తంత్రం తెరకెక్కింది. వేదవ్యాస్‌(బ్రహ్మానందం) ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్‌ అవుతాడు. ఇంట్లో బోర్‌ కొడుతుండటంతో స్టోరీ టెల్లర్‌గా కొత్త కెరీర్‌ని ప్రారంభించాలనుకోగా, తన కూతురు రోషిణి(కలర్‌ స్వాతి) ఆయన కోరికని అర్థంచేసుకోకుండా కొంత ఇబ్బంది పెడుతుంది. అయితే కూతురిని లెక్కచేయకుండా స్టాండప్‌ స్టోరీ టెల్లింగ్‌ పోటీలకు వెళ్తాడు వేదవ్యాస్‌. అక్కడ పంచేంద్రియాల కాన్సెప్ట్ తో ఐదు కథలు చెప్ప‌గా అందులో మొదటి కథః దృశ్యం చుట్టూ తిరుగుతుంది. నరేష్‌ అగస్త్య సాఫ్ట్ వేర్‌ ఉద్యోగి కాగా, అత‌నిలో ఏదో అసంతృప్తి. పని ఒత్తిడి కారణంగా ప్రతి చిన్న దానికి అసహనానికి, కోపానికి గురవుతుంటాడు. అయితే ఓ సారి బీచ్ గురించి విన్న‌ప్పుడు అత‌నిలో ఆనందం క‌లుగుతుంది. మ‌రి ఆ ఆనందానికి కార‌ణం ఏంట‌న్న‌ది సినిమా చూస్తే తెలుస్తుంది.

Panchatantram Movie Review know how is the movie
Panchatantram Movie Review

రెండో కథ‌లో రాహుల్‌ విజయ్‌కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అమ్మాయిలు నచ్చక ప్రతిదీ రిజెక్ట్ చేస్తుంటాడు. చివరగా శివాత్మిక రాజశేఖర్‌ ని చూస్తాడు. పేరెంట్స్ కి నచ్చిందనే ఉద్దేశంతో ఆమెకి ఓకే చెబుతాడు. వాళ్లిద్ద‌రు క‌లుసుకునే విష‌యంలో ట్విస్ట్ ఏంట‌న్న‌ది సినిమా చూస్తే తెలుస్తుంది

మూడో కథ లో వాసన గురించితెలియ‌జేస్తుంది. సముద్రఖని బ్యాంకులో జాబ్‌ చేసి రిటైర్డ్ అవుతాడు. అయితే తన కూతురు నెలలు నిండడంతో డెలివరీ దగ్గరపడ‌గా, త‌న‌కు బ్లడ్‌ స్మెల్ వస్తుంటుంది. కూతురు డెలివరీకి, సముద్రఖనికి బ్లడ్‌ వాసన రావడానికి సంబంధం ఏంటనేది మిగిలిన కథ.

నాల్గో కథ విష‌యానికి వ‌స్తే స్పర్శలోని అనుభూతిని తెలిపే కథ ఇది. వికాస్‌ ముప్పాల, దివ్య శ్రీపాద ప్రేమించి పెళ్లి చేసుకోగా, దివ్య శ్రీపాద ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సడెన్‌గా ఓ రోజు ఆమెకి బ్లీడింగ్‌ అవుతుంది. ఆసుపత్రికి వెళ్లగా క్యాన్సర్‌ గా తేలుతుంది. అప్పుడు వికాస్‌, దివ్య శ్రీపాద తీసుకున్న నిర్ణయమేంటి? స్పర్శకి ఉన్న సంబంధం ఏంటనేది మిగిలిన కథ.

ఐదో కథలో వినికిడిలోని గొప్పతనం తెలియజేసే కథ. లియా అనే పేరుతో చిన్న పిల్లల స్టోరీస్‌ చెబుతుంది కలర్స్ స్వాతి. ఉత్తేజ్‌ కూతురు ఆమెకి పెద్ద ఫ్యాన్. ఆ లియా కథ వినందే అన్నం తినదు. స్వాతికి, ఉత్తేజ్‌ కూతురుకి ఉన్న సంబంధం ఏంటి? ఉత్తేజ్‌ కూతురు స్వాతిలో తెచ్చిన మార్పేంటి? వినికిడి పోషించిన పాత్ర ఏంటనేది మిగిలిన కథ. ఈ ఐదు క‌థ‌లు వేద‌వ్యాస్ జీవితాన్ని ఎలా మార్చాయి అన్న‌ది సినిమాలో తెలుస్తుంది.

ప‌ర్‌ఫార్మెన్స్

బ్రహ్మానందంకి ఇదొక డిఫరెంట్‌ రోల్‌. సీరియస్‌ రోల్స్ లోకి టర్న్ తిప్పే సినిమా అవుతుంది. కలర్స్ స్వాతికిది కమ్‌ బ్యాక్ లాంటి సినిమా అవుతుంది. ఆమె పాత్రకి ప్రాణం పోసింది. రాహుల్‌ విజయ్‌, శివాత్మిక, అగస్త్య తమ పాత్రల మేరకు డీసెంట్‌గా బాగా చేశారు. సముద్రఖని నటనతో తన కథని నిలబెట్టారు. దివ్య శ్రీపాద, వికాస్‌ అద్భుతంగా చేశారు. ఆదర్శ్‌ బాలకృష్ణ, ఉత్తేజ్‌, రూప పాత్రలో చిన్నారి సైతం బాగా చేశారు.

దర్శకుడు హర్ష పులిపాక మంచి ఐడియాతో వ‌చ్చాడు కాని, స్లో నెరేషన్‌, వినోదం లేకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. ఒకదాని తర్వాత వచ్చే మరో కథకి భావోద్వేగాలను పెంచుకుంటూ వెళ్లిన తీరు బాగుంది. సంగీతం, బీజీఎం సినిమాకి ప్రాణం. ప్రశాంత్‌ ఆర్‌ విహారి, శ్రవణ్‌ భరద్వాజ్‌ బాగా చేశారు. రాజ్‌ కె నల్లి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ డీసెంట్‌గా, రిచ్‌గా ఉన్నాయి.

ఫైన‌ల్‌గా.. ఈ సినిమాని మంచి ఫీల్‌గుడ్ మూవీగా చెప్ప‌వ‌చ్చు. మన చుట్టూ నిత్యం జరిగే విషయాలను, సంఘటనలనే కథా వస్తువులుగా ఎంచుకుని తెరక్కించిన తీరు బాగుంది. ఈ ఐడియాతో సినిమా తీయాల‌నే ఆల‌చోన చేయ‌డం గొప్ప విష‌యం. ఐదు కథలను, వేద వ్యాస్‌ అనే పాత్ర ద్వారా ముడిపెట్టిన తీరు బాగుంది. క్లైమాక్స్ అదరగొడుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago