Hansika : అందాల ముద్దుగుమ్మ హన్సిక కోరుకున్న ప్రియుడితో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ప్రియుడు సొహైల్ కతురియాతో ఏడడుగులు వేసింది హన్సిక. ఆదివారం అతడిని పెళ్లిచేసుకున్నది. హన్సిక, సొహైల్ పెళ్లి వేడుకల తాలూకు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.హన్సిక, సొహైల్ పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లికి ముందు నుంచే చాలా కాలంగా సొహైల్‌తో హన్సికకు పరిచయం ఉండగా, రెండేళ్లుగా హన్సిక అతడితో ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రేమలో ఉన్నాం అంటూ ప్రకటించినప్పటి నుండి హన్షిక మొత్వానీ, సోహైల్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. పెళ్లి అక్కడ, పెళ్లి ఇక్కడ అంటూ కొన్ని రోజులు, ఇద్దరి ప్రేమ గురించి మరికొన్ని రోజులు , పెళ్లికి అతిథులు వీరేనంటూ ప్రచారం నడిచింది. అయితే వచ్చిన వార్తలకు మించే వారి వివాహం జరిగినట్లు ఆ ఫొటోలు, వీడియోల చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజస్థాన్ జైపూర్ లోని పురాతనమైనటువంటి ముంటోడా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. హన్సికకు సోహైల్ తో తనకిది మొదటి వివాహం కాగా సోహెల్ కి మాత్రం ఇది రెండవ వివాహం కావడం గమనార్హం.
ఈయన హన్సిక స్నేహితురాలిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన అనంతరం హన్సికను వివాహం చేసుకున్నారు. సోహైల్ తనకు బిజినెస్ పార్ట్నర్ గా ఉండడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వచ్చింది. డిసెంబర్ 4వ తేదీ హన్సిక వివాహం జరగగా డిసెంబర్ రెండవ తేదీ నుంచి సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మూడు రోజులపాటు వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. హన్సిక తన వివాహం కోసం ఎంత మొత్తంలో ఖర్చు చేశారనే విషయం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే హన్సిక తన పెళ్లి కోసం సుమారు 20 కోట్ల వరకు ఖర్చు చేశారని టాక్ నడుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…