Nagarjuna Bigg Boss Dress : టాలీవుడ్ నవ మన్మథుడిగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి ప్రేక్షకులని అలరించారు నాగార్జున. ఆయన ఇప్పుడు తన తనయులతో పోటీగా సినిమాలు చేస్తున్నారు. రీసెంట్‌గా ది ఘోస్ట్ చిత్రంతో పలకరించగా, ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం చెందింది. అయితే సినిమాల సంగతేమో కాని బిగ్ బాస్ షోతో అదరగోడుతున్నాడు నాగ్. సిక్స్టీ ప్లస్‌లో ఉన్నా.. నాగార్జున ఓ 20 ఏళ్లు వెనక్కి నెట్టి.. 40 ఏళ్ల మన్మథుడి మాదిరే రెడీ అవుతూ బిగ్ బాస్ వేదికపై తెగ సందడి చేస్తున్నాడు.ముఖ్యంగా ఆయన డ్రెస్సింగ్ స్టైల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏ డ్రెస్ వేసినా కూడా నాగార్జునకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
బిగ్ బాస్ హౌస్‌లో నాగార్జున వేసే క్యాస్ట్యూమ్స్ మాత్రం చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. శని ఆదివారాల్లో హోస్ట్‌గా నాగార్జున మెరుస్తూ ఉండగా, ఆయన వేసే టీషర్ట్‌లు, జెర్సీలు చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. కొన్ని చూడగానే అబ్బా భలే ఉందే అనేట్టుగా ఉంటే.. కొన్ని మాత్రం ఆ క్యాస్ట్యూమ్స్ డిజైనర్ ఎవడ్రా బాబూ అనేట్టుగానే అనిపిస్తున్నాయి.డిఫరెంట్ డిజైన్స్ తో.. నాగ్ వేసుకొచ్చే డ్రెస్ లన్నీ.. లక్షల్లోనే ఉంటాయని బిగ్ బాస్ ఫాలోయర్స్ సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఇలాంటివి హైదరాబాద్ లోని కోఠికి వెళ్తే వంద, నూటయాభైకి కూడా దొరుకుతాయి అని కొందరికి అనిపిస్తుంది.
కాని నాగార్జున ధరించే ఒక్కో షర్ట్ ధర మినిమం 2 లక్షలపైనే ఉంటుంది. నాగ్ వేసే డ్రెస్సెస్ అన్ని టాప్ బ్రాండ్స్. అయితే.. ధర చూస్తే లక్షల్లో ఉందేమో గానీ, లుక్ పరంగా కోఠిలో కొన్నట్లుగానే ఉన్నాయని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Louis Vuitton, Gucci, Fendi,Off White, Prada లాంటి ఇంటర్నేషనల్ బ్రాండెడ్ షర్ట్స్‌ని నాగార్జున కోసం ప్రత్యేకించి రప్పిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. నవంబర్ 27 శనివారం నాటి 85 వ ఎపిసోడ్‌లో వేసుకున్న డ్రెస్.. ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ బొమ్మల చొక్కా ఏకంగా.. 2, 25, 727 గా ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. ఇది తెలుసుకొని అందరు అవాక్కవుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…