Team India : 2023 ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఇప్పటి వరకు 8 జట్లతో తలపడగా, అన్నింటిలో విజయం సాధించింది. దీంతొ సెమీఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. చివరిగా సౌతాఫ్రికాతోను పోటీ పడగా, దానిపై కూడా ఘన విజయం సాధించింది. ఇక దాయాదుల పోరు ఉర్రూతలూగిస్తుందని భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులను.. వన్డే ప్రపంచకప్‌లో మెగాఫైట్ ఊసూరు మనిపించింది. చిరకాల ప్రత్యర్థుల మధ్య వైరం వీక్షించేందుకు మైదానానికి విచ్చేసిన లక్ష మంది అభిమానులతో పాటు.. టీవీల్లో చూస్తున్న కోట్లాది మందిని పాకిస్థాన్ జట్టు తీవ్రంగా నిరాశ పరిచింది. కనీస ప్రతిఘటన లేకుండా.. ఏమాత్రం పోటీ నివ్వకుండా పాక్ చేతులెత్తేయడంతో.. రోహిత్ మెరుపులు తప్ప మ్యాచ్‌లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు.
అయితే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకువెళ్తుండటంపై కొందరు పాకిస్థాన్ ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారు. దీంతో టీమిండియాపై విమర్శలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. పాకిస్థాన్ మాజీ ఆటగాడు హసన్ రజా అయితే తాజాగా తన విమర్శలతో రెచ్చిపోతున్నాడు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ఒక్కటే వేరే బాల్స్‌తో ఆడుతోందని.. అందుకే వికెట్లు చకచకా పడగొడుతోందని ఆరోపిస్తున్నాడు. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి 55 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా టీమిండియా 302 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల ప్రదర్శన చూసిన తర్వాత హసన్ రజా వాళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ, ఐసీసీ, థర్డ్ అంపైర్ కలిసి భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నారని నోటికి వచ్చినట్టు వాగాడు. ఈ అంశంపై విచారణ చేయాలని డిమాండ్ చేశాడు. తాజాగా ఆప్ఘనిస్తాన్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కూడా తొలుత ఆప్ఘన్ బౌలర్లకు టీమిండియా వాడే బంతులు ఇచ్చారని.. అందుకే వాళ్లు వికెట్లు తీశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.దీనిపై పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ ఖండించాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి పాకిస్థాన్ పరువు తీయవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా హసన్ రజా కామెంట్లపై టీమిండియా ఆటగాడు షమీ స్పందిస్తూ.. ఈ విధమైన వ్యాఖ్యలు చేయడానికి కాస్త అయినా సిగ్గుపడాలని అన్నాడు.ఆటపై ఫోకస్ పెట్టాలి కానీ ఇలాంటి బక్వాస్ మాటలు మాట్లాడొద్దని షమీ హెచ్చరించాడు. ఇది ఐసీసీ ప్రపంచకప్ అని.. గల్లీ క్రికెట్ కాదని గుర్తుచేశాడు. హసన్ రజా పేరు ప్రస్తావించకుండానే అతడి వ్యాఖ్యలకు షమీ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…