Maxwell : అంత నొప్పితో ఉన్నా మ్యాక్స్‌వెల్‌కి బై ర‌న్న‌ర్ ఎందుకు రాలేదు..?

Maxwell : గ‌త రెండు మూడు రోజులుగా ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్ మ్యాక్స్‌వెల్ గురించి చ‌ర్చ న‌డుస్తుంది. మంగ‌ళ‌వారం ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా అఫ్గానిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మాక్స్‌వెల్ అసాధార‌ణ ఇన్నింగ్స్ ఆడ‌డ‌మే అందుకు కార‌ణం. మిగ‌తా బ్యాట‌ర్లంతా పెవిలియ‌న్‌కు చేరుకున్నా కూడా ఒంటరి పోరాటం చేసి త‌మ జ‌ట్టుని గెలిపించి సెమీస్‌కి చేర్చాడు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్స‌ర్ల‌తో 201 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచి జ‌ట్టుకు అద్వితీయ‌మైన విజ‌యాన్ని అందించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా త‌రుపున ద్విశ‌త‌కం బాదిన మొద‌టి ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. అయితే ఈ మ్యాచ్ లో తాను బ్యాటింగ్ చేసే సమయంలో తీవ్ర నొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. అలాంటి సమయంలో బైరన్నర్ రాకపోవడానికి కారణం ఏంటి అని క్రికెట్ లోకం చర్చించుకుంటున్నారు.

అసలు బై రన్నర్ రాకపోవడానికి కారణం ఏంట‌నేది ఇప్పుడు చూద్దాం. మాక్స్ వెల్ బ్యాటింగ్ సమయంలో తీవ్రమైన కండరాల నొప్పితో గ్రౌండ్ లోనే పడిపోయాడు. కండరాలు పట్టేసి సరిగా నిలబడలేని, నడవలేని స్థితిలో ఉన్న మాక్సి ఎందుకు అలాగే బ్యాటింగ్ కొనసాగించారనేది ఇప్పుడు అందరిలో ఓ పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ప‌లుమార్లు ఫిజియో వచ్చి మాక్స్ వెల్ కు ఉమశమనం కలిగించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో మ్యాక్సి బ్యాటింగ్ చేయడం కష్టమని భావించిన ఆసిస్ ఆడం జంపను బ్యాటింగ్ కు పంపింది. కానీ మాక్సి రిటైర్డ్ హట్ గా వెళ్లేందుకు ఇష్టపడలేదు.

why Maxwell not allowed to get by runner
Maxwell

నొప్పి భరిస్తూ ఒంటరీ పోరాటం చేశాడు. అయితే ఆ సమయంలో బైరన్నర్ వస్తే సరిపోతుంది, కానీ ఆ వెసులుబాటును ఐసీసీ తీసేసింది. బ్యాటర్లు గాయపడినా, రన్ తీసేందుకు ఇబ్బంది పడినా బైరన్నర్ ను పెట్టుకునే అవకాశాన్ని ఐసీసీ తొలగించింది. అంతర్జాతీయ క్రికెట్ లో రన్నర్ విధానాన్ని ఎత్తి వేయాలని ఐసీసీ ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ 2011 లోనే నిర్ణయించింది. ఆట మధ్యలో ఇబ్బందులు తలెత్త కూడదని చేసిన సిఫార్స్ లను పరిగణించిన ఐసీసీ రన్నర్ విధానానికి చరమగీతం పాడింది. ఈకారణంగానే మాక్సి వెల్ కు బై రన్నర్ ను పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. కాగా.. దేశ‌వాలీ, ఇత‌ర క్రికెట్ ఆట‌ల్లో మాత్రం య‌థావిధిగా బై ర‌న్న‌ర్‌ను పెట్టుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ స‌వ‌ర‌ణ కార‌ణంగానే మాక్స్‌వెల్‌కు కండ‌రాలు ప‌ట్టేసినా బై ర‌న్న‌ర్‌ను తీసుకునే అవ‌కాశం లేకుండా పోయింది. దీనిపై అప్ప‌ట్లో సునీల్ గ‌వాస్క‌ర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశాడు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago