Team India : వరల్డ్ కప్ 2023లో భారత్ ఎలాంటి ప్రదర్శన చేసింతో మనం చూశాం. వారి ప్రదర్శనకి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఒక్క ఓటమి లేకుండా భారత్ ఫైనల్ వరకు వెళ్లింది. ఇక మన దాయాది పాకిస్థాన్ ఎలాంటి ఆటతీరు కనబర్చిందో అందరికీ తెలిసిందే. వరల్డ్ కప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన పాకిస్థాన్ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. తర్వాతి మూడు మ్యాచ్‌లకు గానూ రెండింట్లో గెలిచి చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. ఇంగ్లాండ్‌పై భారీ తేడాతో గెలిచి సెమీస్ చేరతామని ప్రగల్భాలు పలికిన పాక్.. చివరకు బొక్కబోర్లాపడి లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది.
అయితే న్యూజిలాండ్‌పై గెలిచి సెమీస్ చేరుకున్న టీమిండియాపై పాక్ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్… ఫైనల్ చేరడానికి ఇండియాకు పూర్తి అర్హత ఉందని, ఈ క్రెడిట్ అంతా రోహిత్ శర్మదే అని అక్తర్ అన్నాడు. ఇండియా మరోసారి న్యూజిలాండ్ ను నిర్దాక్షిణ్యంగా ఓడించింది. ఇండియాకు ఫైనల్ చేరడానికి పూర్తి అర్హత ఉంది. ఆ టీమ్ కాకపోతే మరే టీమ్ ఫైనల్ వెళ్తుంది? క్రెడిట్ అంతా రోహిత్ శర్మకే దక్కుతుంది. కెప్టెన్ గా, ప్లేయర్ గా, బ్యాట్స్‌మన్ గా క్రెడిట్ మొత్తం రోహిత్ కే వెళ్తుంది. బౌలర్లపై విరుచుకుపడి వాళ్లను కొట్టి కొట్టి గాలి తీసేస్తాడు అని అన్నాడు. విరాట్ కూడా చాలా అద్భుతమైన ఆటతీరు కనబరచి సరికొత్త చరిత్ర సృష్టించాడని అన్నాడు.
ఇక వసీం అక్రమ్, బాబర్ ఆజమ్, షాహిద్ ఆఫ్రిది వంటి వారు కూడా భారత ఆటతీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. మొదటి నుండి చక్కని ఆటతీరుని ప్రదర్శిస్తూ ఫైనల్ వరకు వెళ్లారు. కలిసికట్టుగా ఆడుతూ మంచి విజయాలని అందుకుంటున్నారు. విరాట్ 50 సెంచరీలు చేయడం మాములు విషయం కాదు. ఆయన కెరీర్‌లో మరెన్నో సాధిస్తాడని అన్నారు. ఇది ఇలా ఉంటే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ చేస్తున్నాడని పాక్ మాజీ ఆటగాడు సికందర్ బఖ్త్ ఆరోపించాడు. తన ప్రత్యర్థి కెప్టెన్‌కు, ఐసీసీ అధికారులకు దూరంగా రోహిత్ కాయిన్ విసురుతున్నాడని.. ఫలితం ఇండియాకు అనుకూలంగా వస్తోందన్నాడు. అంటే రోహిత్ కాయిన్‌ను కాస్త దూరంగా విసరడం వల్ల.. ప్రత్యర్థి కెప్టెన్‌కు అది బొమ్మ పడిందా, బొరుసు పడిందా అని చెక్ చేయలేడు. కాయిన్ చూసే వ్యక్తిని బీసీసీఐ మేనేజ్ చేయడం వల్ల టీమిండియా టాస్ గెలుస్తోందనేది అతగాడి అభిప్రాయం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…