Balakrishna : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మరోవైపు బాలయ్య పాలిటిక్స్ తో కూడా బిజీగా ఉన్నారు. బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలయ్య హిందూపురం పర్యటన రసవత్తరంగా మారింది. జనసేన, టిడిపి సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు బాలయ్య హిందూపురం వెళ్లారు. ఈ సమావేశంలో బాలయ్య పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజీగా మారాయి.
తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయనకి నాకు చాలా సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరం ముక్కు సూటిగా మాట్లాడతాం. ఎవ్వరికి భయపడం. అలాగే అవినీతి అరాచకాలకు పాల్పడే వాళ్ళని లెక్కచేయకపోవడం ఇలా తనకి, పవన్ కళ్యాణ్ కి పోలికలు ఉన్నాయని బాలయ్య అన్నారు. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశానికి బాలకృష్ణ మెడలో జనసేన కండువా వేసుకుని రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జనసేన, తెలుగు దేశం పార్టీ పొత్తులో పోటీ చేయబోతున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ పవన్ కళ్యాణ్, బాలయ్య లని ఫ్యాన్స్ ఒకే వేదికపై చూసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఎక్కడ ఒక పని కూడా జరగట్లేదన్నారు. హిందూపురంలో తన సొంత నిధులు, పార్టీ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు బాలయ్య తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం రెండు పార్టీలు టీడీపీ, జనసేన కలిసికట్టుగా పనిచేస్తాయని బాలయ్య వెల్లడించారు. టీడీపీ- జనసేన కలవడం ఒక కీలకమైన ఘట్టమన్నారు. నాడు ఎన్టీ రామారావు కూడా గతంలో పార్టీలన్నీ ఏకం చేసి అన్యాయంపై తిరుగుబాటు చేసారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ జై టీడీపీ, జై జనసేన నినాదాలు చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…