Taraka Ratna Wife : నందమూరి తారకరత్న అనూహ్యంగా మరణించడం ప్రతి ఒక్కరిని ఎంతో కలవరపరచింది. ఫిబ్రవరి 18న ఆయన కన్నుమూయగా నేటికీ తన భర్త జ్ఞాపకాలతో తీవ్ర భావోద్వేగం చెందుతోంది తారకరత్న వైఫ్ అలేఖ్య రెడ్డి. తన భర్తతో గడిపిన ఆ క్షణాలను మరచిపోలేక పోతోంది అలేఖ్య రెడ్డి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంత ఓదార్చినా కూడా కంటతడి పెట్టుకోవడం మాత్రం ఆపడం లేదట. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా బాలకృష్ణ గురించి ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు.
‘మనం సొంత కుటుంబంగా పిలిచే ఏకైక వ్యక్తి (బాలకృష్ణ). కష్ట, సుఖాల్లో చివరి వరకు ఒక కొండలా అండగా నిలిచిన ఏకైక వ్యక్తి. ఒక తండ్రిలా ఆసుపత్రికి తీసుకెళ్లడం దగ్గర నుంచి ఆసుపత్రిలో నీ బెడ్ పక్కన కూర్చోవడం, నీ కోసం తల్లిలా పాటలు పాడటం, సిల్లీ జోక్స్ వేసి నువ్వు రియాక్ట్ కావాలని ప్రయత్నించడం, చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం… ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు. ఓబు (తారకరత్న) నీవు తొందరగా వెల్లిపోయావు. మిస్ యూ సోమచ్’ అని అలేఖ్య చాలా ఎమోషనల్ గా తన పోస్ట్‌లో పేర్కొంది.
తన భర్త అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నప్పటినుంచి మృతి చెందాక కూడా బాలయ్య చేసిన సేవలు అంతా ఇంతా కాదు.తారకరత్న చివరి రోజుల్లో నందమూరి బాలకృష్ణ పడిన తపన గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో 23 రోజుల పాటు తారకరత్నకు చికిత్స జరగగా.. ఆయన వెంటే ఉండి కొడుకును కాపాడుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేశారు బాలకృష్ణ. తారకరత్నను బతికించుకోవడానికి బాలయ్య బాబు చేయని ప్రయత్నమే లేదు. నందమూరి ఫ్యామిలీ అందరిలో ఆయనే స్పెషల్ కేర్ తీసుకున్నారు. కానీ చివరకు అందరినీ వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు తారకరత్న.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…