Meena : దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు తెలుగు సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపిన అందాల భామ మీనా. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన మీనా ఆ తర్వాత ‘నవయుగం’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘సీతారామయ్య మనవరాలు’ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోలతో జోడీ కట్టి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మీనా.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోని స్టార్ హీరోలందరితో మీనా జోడీ కట్టింది. నటిగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ప్రముఖ వ్యాపరవేత్త విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది.
విద్యాసాగర్, మీనా దంపతులకి ఓ పాప జన్మించింది. వారి జీవితం అంతా హ్యపీగా సాగుతుందనుకున్న సమయంలో గతేడాది మీనా భర్త విద్యాసాగర్ చనిపోయాడు. భర్త మరణంతో మీనా డిప్రెషన్ లోకి వెళ్లింది. ఇటీవల ఆ డిప్రెషన్ నుండి బయటపడినట్టు తెలుస్తుంది. తాజాగా మీనా ఓ ఇంటర్వ్యూలో తన క్రష్ గురించి చెప్పుకొచ్చింది. వివాహం కాకముందు హీరో హృతిక్ రోషన్ అంటే తనకు క్రష్ అని చెప్పిన ఆమె తనకు అలాంటి అబ్బాయితో పెళ్లి చేయమని వాళ్ళ అమ్మతో చెప్పిందట. ఇక హృతిక్ పెళ్లి రోజు మీనా చాలా ఫీల్ అయ్యారట. తన గుండె బద్దలైందని మీనా ఓపెన్ గా చెప్పారు. ఈ విషయాన్ని మీనా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ కండలవీరుడిగా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్ 2000 సంవత్సరంలో ఫ్యాషన్ డిజైనర్ సుసానే ఖాన్ ని వివాహం చేసుకున్నారు. 2014లో హృతిక్ రోషన్ ఆమెకు విడాకులిచ్చారు. వీరికి ఇద్దరు సంతానం. ఇక మీనా విషయానికి వస్తే తన భర్త మరణం తర్వాత మీనా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక తన కుమార్తె సినీ ఎంట్రీ కోసం మాట్లాడుతూ.. తన కూతురు పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. మీనా కుమార్తె నైనికా విజయ్ నటించిన తేరితో సినీ రంగ ప్రవేశం చేసింది, ఇది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…