Anjali : ఇటీవలి కాలంలో అందాల ముద్దుగుమ్మలు పెళ్లి పీటలు ఎక్కుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. : కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారు. కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే మంచి సంబంధాలు వస్తాయని ఆశిస్తున్నారు కాబోలు. అందుకే వారంతా ఇప్పుడు పెండ్లి చేసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అందాల ముద్దుగుమ్మ అంజలి కూడా పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమయిందని తెగ ప్రచారం నడుస్తుంది. తెలుగు అమ్మాయి అయినా సరే తమిళ సినిమాలతో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
తమిళంలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరున్న ఈ అమ్మడు కొద్ది రోజుల తర్వాత తెలుగులోను మంచి ఆఫర్స్ అందుకుంది. ఎందుకనో కని తెలుగులో అంతగా రాణించలేకపోయింది. ఇప్పుడు ఆమె శంకర్ సినిమాలో నటిస్తోంది. ఈ అమ్మడు తెలుగులో కంటే కూడా తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. అక్కడ ఆమెకు మంచి ఫేం వచ్చినా, సక్సెస్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. ఇక ఆ తరువాత తన పర్సనల్ లైఫ్ కారణంగా అంజలి కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. తమిళ యాక్టర్ జై తో అంజలి కొంతకాలం రిలేషన్‌లో ఉందనే వార్తలు రావడం ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపెట్టిందనే చెప్పాలి.
కోలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్ గా మారి.. తరువాత తెలుగులో అడుగు పెట్టిన అంజలి..జర్నీ సినిమాతో రెండు భాషల్లో బాగా పాపులర్ అయ్యింది. ఆతరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. సినిమా ఆమె కెరీర్ కి ప్లస్ అయ్యింది. అయితే అంజలికి సంబంధించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. సినీ వర్గాల్లో వస్తున్న వార్తల ప్రకారం, అంజలి తల్లిదండ్రులు ఆమెకు ఓ మంచి కుర్రాడిని చూసినట్లుగా తెలుస్తోంది. అయితే అంజలి తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటుండగా, తమ కూతురి కోసం చెన్నైలో ఉంటున్న ఓ తెలుగు కుర్రాడిని చూశారని.. త్వరలోనే ఆమెకి పెళ్లి చేయనున్నారని టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…