నందమూరి తారకరత్న ఆయన గుండె పోటు కు గురై 23 రోజుల నుండి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చివరికి శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఇక నందమూరి తారకరత్న లేరని తెలియగానే కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా బోరున విలపించారు. ఇంత చిన్న వయసులో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని చాలామంది కన్నీరు కార్చారు.మరీ ముఖ్యంగా తారకరత్న భార్య పిల్లలకు ఆయన చనిపోవడం ఒక పెద్ద విషాదం అని చెప్పవచ్చు. తారకరత్న తల్లిదండ్రులకు ఇది కడుపుకోతనే. తారకరత్న ఇక లేరని తెలిసి ఆయన కూతురు వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెను ఆపడం ఎవరి తరం కావడం లేదు.
తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం కాగా, దంపతులకు మొదట ఒక పాప జన్మించింది. తారకరత్న కుమార్తె పేరు నిష్క. ఆ తర్వాత వీరికి కవల పిల్లలు సంతానం కలిగినట్లు తెలుస్తోంది. అయితే తారక రత్నకి కుమార్తె నిష్క అంటే పంచ ప్రాణాలు కాగా, తన తండ్రిని ఎప్పుడు వదిలి ఉండలేదు. ఆ మధ్య తిరుమలలో కూడా కూతురితో కనిపించారు. అయితే ఎంతో యాక్టివ్‌గా ఉత్సాహంగా కనిపించే తన తండ్రి ఇలా మరణించడం కుమార్తెని ఎంతో బాధించింది. తన తండ్రి లేడని తలచుకుని నిష్క వెక్కి వెక్కి ఏడుస్తుంది. నిష్కని ఓదార్చడం కుటుంబ సభ్యుల తరం కూడా కావడం లేదు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హృదయాలు ద్రవించేలా చేస్తున్నాయి.
రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతానని స్పష్టంగా చెప్పిన తారకరత్న.. రాజకీయంగా అత్యంత బిజీగా మారుతున్న తరుణంలోనే.. జనవరి 26న తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేష్‌తో పాదయాత్ర చేస్తూ తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి 23 రోజులుగా చికిత్స అందించారు.కాని ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూసారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…