Tammineni Seetaram : మ‌నకి ఇవి అవ‌స‌ర‌మా.. క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ అంటూ కింద ప‌డిపోయిన ఏపీ స్పీక‌ర్..

Tammineni Seetaram : ప్ర‌స్తుతం ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘ఆడుదాం ఆంధ్ర’’ కార్యక్రమంకి పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. కొన్ని చోట్ల మంచి స్పంద‌న వ‌స్తుండ‌గా, మ‌రి కొన్ని చోట్ల నిర్వహణ తీరుపై క్రీడా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ పాలనలో క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. గతంలో లేని పే అండ్ ప్లే విధానాన్ని తెచ్చి క్రీడలకు విద్యార్థులను దూరం చేశారని అంటున్నారు. విద్యార్థులకు ఓట్లు లేకపోవడం వల్లే క్రీడలను జగన్ నిర్లక్ష్యం చేశారని ఆగ్రహించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఆడుదాం ఆంధ్ర అని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వంలో క్రీడా రంగం బడ్జెట్ ఎంతో సీఎం జగన్ రెడ్డికి తెలుసా అని కుమ్మరి క్రాంతి కుమార్ ప్రశ్నించారు.

రీసెంట్‌గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ప్రారంభించారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోల కాలేజీలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. సీఎం వైఎస్ జగన్ ఉత్సాహంగా క్రికెట్ ఆడారు. అక్కడే ఉన్న మంత్రి రోజాను సైతం క్రికెట్ ఆడాలంటూ ప్రోత్సహించారు. క్రికెట్ ఆడేందుకు అఇష్టత చూపుతున్న రోజాకు సీఎం జగన్ బ్యాటింగ్ నేర్పించారు. బ్యాటింగ్ చేయడానికి జంకుతున్న రోజాను ప్రోత్సహించారు. బ్యాట్ ఎలా పట్టుకోవాలి? గ్రిప్ పొజిషన్ ఎలా ఉండాలి? స్టాన్స్ ఎలా ఉండాలి? అనే అంశాలను వివరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అవుతున్నాయి.

Tammineni Seetaram fell on ground while playing cricket
Tammineni Seetaram

తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించిన ఆయన.. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు తాను కూడా బరిలోకి దిగారు. కబడ్డీ ఆడుతూ అక్కడున్న వాళ్లందర్నీ హుషారెత్తించారు. ఈ క్రమంలో కాలు జారి కింద పడిపోయారు. సీతారాం కిందపడగానే సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. వెంటనే సీతారాంను పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం కప్ పేరుతో జ‌రిగిన టోర్న‌మెంట్స్‌లో ఇది జ‌రిగింది. ఇది పాత వీడియో అయిన ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago