Tammineni Seetaram : ప్రస్తుతం ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘ఆడుదాం ఆంధ్ర’’ కార్యక్రమంకి పెద్ద ఎత్తున ఆదరణ దక్కుతుంది. కొన్ని చోట్ల మంచి స్పందన వస్తుండగా, మరి కొన్ని చోట్ల నిర్వహణ తీరుపై క్రీడా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ పాలనలో క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. గతంలో లేని పే అండ్ ప్లే విధానాన్ని తెచ్చి క్రీడలకు విద్యార్థులను దూరం చేశారని అంటున్నారు. విద్యార్థులకు ఓట్లు లేకపోవడం వల్లే క్రీడలను జగన్ నిర్లక్ష్యం చేశారని ఆగ్రహించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఆడుదాం ఆంధ్ర అని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వంలో క్రీడా రంగం బడ్జెట్ ఎంతో సీఎం జగన్ రెడ్డికి తెలుసా అని కుమ్మరి క్రాంతి కుమార్ ప్రశ్నించారు.
రీసెంట్‌గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ప్రారంభించారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోల కాలేజీలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. సీఎం వైఎస్ జగన్ ఉత్సాహంగా క్రికెట్ ఆడారు. అక్కడే ఉన్న మంత్రి రోజాను సైతం క్రికెట్ ఆడాలంటూ ప్రోత్సహించారు. క్రికెట్ ఆడేందుకు అఇష్టత చూపుతున్న రోజాకు సీఎం జగన్ బ్యాటింగ్ నేర్పించారు. బ్యాటింగ్ చేయడానికి జంకుతున్న రోజాను ప్రోత్సహించారు. బ్యాట్ ఎలా పట్టుకోవాలి? గ్రిప్ పొజిషన్ ఎలా ఉండాలి? స్టాన్స్ ఎలా ఉండాలి? అనే అంశాలను వివరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఆయన.. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు తాను కూడా బరిలోకి దిగారు. కబడ్డీ ఆడుతూ అక్కడున్న వాళ్లందర్నీ హుషారెత్తించారు. ఈ క్రమంలో కాలు జారి కింద పడిపోయారు. సీతారాం కిందపడగానే సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. వెంటనే సీతారాంను పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం కప్ పేరుతో జరిగిన టోర్నమెంట్స్‌లో ఇది జరిగింది. ఇది పాత వీడియో అయిన ప్రస్తుతం వైరల్‌గా మారింది.