Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులని సైతం అలరిస్తున్నాడు. అయితే విజయ్ రానున్న రోజులలో పాలిటిక్స్‌లోకి కూడా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కలిశారు. ప్రగతి భవన్‌కి వెళ్లి మరీ సీఎం కేసీఆర్‌ను కలిశారు విజయ్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ విజయ్‌ను సన్మానించారు. అనంతరం కాసేపు ముచ్చటించుకున్నారు. కాగా ఇది మర్యాదపూర్వక భేటీనే అని చెబుతున్నా వీరిద్దరూ కలిసి సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.
తమిళనాట విజయ్‌కు మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్‌తోనే పరోక్షంగా రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా కేసీఆర్ తరహాలోనే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడీ కోలీవుడ్ స్టార్. అప్పుడప్పుడు విజయ్ వ్యవహరిస్తోన్న తీరు కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటోంది. లియో సక్సెస్‌మీట్ తరువాత దళపతి పొలిటికల్ ఎంట్రీ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. లియో రిలీజ్‌కు ముందు భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు మేకర్స్.కానీ అప్పట్లో పర్మిషన్ రాకపోవటంతో ఆ ఈవెంట్ జరగలేదు. అయితే ఈవెంట్‌కు పర్మిషన్స్ రాకపోవటం వెనుక పొలిటికల్ రీజన్స్ ఉన్నాయన్నటాక్ చాలా బలంగా వినిపించింది.
అదే సమయంలో దళపతి రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ కూడా మరోసారి తెర మీదకు వచ్చింది. రీసెంట్‌గా లియో సక్సెస్ మీట్ కోలీవుడ్‌లో పొలిటికల్ హీట్‌కు కారణమైంది. ఆ సక్సెస్ మీట్‌లో విజయ్ మాట్లాడుతూ.. నేను దళపతిని, ప్రజల దళపతిని, వాళ్లు ఏది చెబితే అది చేస్తాను, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను’ అంటూ విజయ్ చెప్పటంతో ఇది పొలిటికల్ ఎంట్రీ గురించే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే దళపతి విజయ్, షారుక్ ఖాన్ లను కలిపి ఒకే ఫ్రేమ్ లో చూపించడానికి అట్లీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. దీనికి ఈ ఇద్దరు సూపర్ స్టార్లూ రెడీగా ఉన్నట్లు అట్లీ స్పష్టం చేశాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…