Chiranjeevi : కోడి గుడ్డు మీద ఈకలు పీకే వాళ్లు చాలా మందే ఉంటారు. సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగాక సెలబ్రిటీలపై ట్రోలింగ్ బాగా నడుస్తుంది. చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా చిరంజీవిపై ట్రోల్స్ చేస్తున్నారు తమిళ సినీ ప్రేక్షకులు. గత రాత్రి చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ట్రైలర్ విడుదల కాగా, ఇందులో కొన్ని సన్నివేశాలను ఒరిజినల్ చిత్రం లూసిఫర్‌తో పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఒక సన్నివేశంలో చిరంజీవి పోలీసు స్టేషన్‌లో సముద్రఖని పోషించిన పోలీస్ పాత్రని కొట్టడం కనిపిస్తుంది. ఈ షాట్‌ను మోహన్‌లాల్ ఒరిజినల్ షాట్‌తో పోల్చారు.
చిరంజీవి తన కాలుని సరిగ్గా పైకి ఎత్తలేకపోయాడని ట్రోల్స్ చేస్తున్నారు. ఇది మెగా అభిమానులకి చిరాకు కలిగిస్తుంది. తమిళ హీరోలు గతంలో చాలా సార్లు తెలుగు సినిమాలని, పాటలని కంపు చేశారనే విషయం గుర్తుంచుకోవాలని చురకలు అంటిస్తున్నారు. కొందరు అయితే అదే షాట్‌ని ఉపయోగించి సముద్రఖనిపై ట్రోల్స్ చేస్తున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్.. సముద్రఖనితో సినిమా డైరెక్ట్ చేస్తుండగా, నా తమ్ముడితో సినిమాకి దర్శకత్వం వహించడానికి మీకు ఎంత ధైర్యం ? అని క్యాప్షన్ పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక గాడ్ ఫాదర్ విషయానికి వస్తే.. అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలో అనంతపురం వేదికగా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. చిరంజీవి అభిమానుల నుండి ఈ ఈవెంట్ కి భారీ ఆదరణ దక్కింది. వేలల్లో ఈ ఈవెంట్ కి ఫ్యాన్స్ హాజరయ్యారు. మెగా అభిమానుల కోలాహలం మధ్య గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. చిరంజీవి తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. గాడ్ ఫాదర్ మంచి విజయం సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…