Tamannaah : సెలబ్రెటీలపై రూమర్లు రావడం కామనే. కానీ నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు ఏదో చిన్న హింట్ ఉంటే తప్ప రూమర్లు కూడా అంతలా స్ప్రెడ్ అవ్వవు. కాగా, సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ తమన్నా పెళ్లి వార్తలు ఓ పక్క వైరల్ అవుతుండగా.. నేరుగా రంగంలోకి దిగి తనకు కాబోయే వాడిని చూపించింది తమన్నా. తమన్నా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో త్వరలో ఏడడుగులు వేయబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు ఆమె ఎక్కువగా సినిమాలు చేయకపోవడానికి కారణం కూడా ఇదేనంటూ కథనాలు అల్లేసారు. తాజాగా తన పెళ్లి వార్తలపై స్పందించింది మిల్కీబ్యూటీ తమన్నా. ఈ సందర్భంగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది! దీంతో అది చూసిన నెటిజన్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. నా భర్తను పరిచయం చేస్తున్నా.. ఆ వ్యాపారవేత్త ఇతనే అంటూ ఓ వీడియోను పంచుకుంది. అయితే అందులో ఉన్నది తమన్నా అని తెలిసి అంతా ఖంగుతిన్నారు.
కాగా గతంలో తమన్నా మగాడి వేషంలో చేసిన ఓ రీల్‌కు సంబంధించిన వీడియో అది. ఎఫ్ 3 మూవీ సమయంలో తీసుకున్న వీడియో. ఎఫ్ 3 లో తమన్నా కొన్ని సీన్స్ లో మగాడి వేషంలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తమన్నా తీసుకున్న వీడియో క్లిప్‌ను ఇప్పుడు షేర్ చేసి తన పెళ్లి వార్తలను ఖండించింది. కాగా ప్రస్తుతం తమన్నా చిరంజీవి భోళా శంకర్ సినిమాతో పాటు ఓ తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఇటీవల సత్యదేవ్ తో ఆమె కలిసి నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…