Rakul Preet Singh : టాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ మంది హీరోయిన్ల లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ధ్రువ, సరైనోడు, జయ జానకి నాయక వంటి హిట్ సినిమాలతో టాలీవుడ్ లో తన క్రేజ్ ను అమాంతం పెంచుకుంది ఈ అమ్మడు. అయితే ఈ మధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెలుగులో ఎటువంటి సినిమాలు రాలేదు. ప్రస్తుతం టాలీవుడ్ కు కాస్త దూరంగా ఉన్నా కూడా అభిమానులకు మాత్రం అందుబాటులోనే ఉంటోంది. తాజాగా రకుల్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఓ మీడియా సంస్థ ఇచ్చిన అవార్డును తీసుకుంటూ రకుల్ మురిసిపోయింది.
దీనికి కారణమైన వారందరికీ, నా వెంటే ఉండి నన్ను ప్రోత్సహించిన వారందరికీ థాంక్స్ అంటూ రకుల్ ప్రీత్ ట్వీట్ చేసింది. రకుల్ వేసిన ఈ ట్వీట్ మీద రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. కంగ్రాట్స్ రకుల్ అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశాడు. ఇక రాహుల్ వేసిన ట్వీట్‌కు రకుల్ స్పందిస్తూ.. థాంక్యూ బడే భయ్యా (పెద్దన్న) అంటూ రెడ్ హార్ట్ సింబల్స్‌ను షేర్ చేసింది. దీనికి రాహుల్ రిప్లై ఇస్తూ హగ్గింగ్ ఎమోజీలను షేర్ చేశాడు. మొత్తానికి చిన్మయి భర్తను రకుల్ ఇలా బడే భయ్యా అని పిలుస్తుందన్న మాట. ఈ ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉందన్న మాట.
రకుల్ పాత్రకు చిన్మయి డబ్బింగ్ చెబుతుందన్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన మన్మథుడు 2 సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించింది. రకుల్ తెలుగులో చివరగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం సినిమా చేసిన ఈ బ్యూటీ మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తోంది. టాలీవుడ్ దర్శకనిర్మాతల చూపు తనపై పడేలా సోషల్ మీడియా వేదికగా కవ్విస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ కాస్త స్లో కావడంతో రకుల్ రెమ్యూనరేషన్ విషయంలో కాస్త సడలింపు ఇచ్చిందట. చూడాలి మరి ఈ హాట్ హీరోయిన్ ప్రయత్నాలు ఏ మేర సక్సెస్ అవుతాయో.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…