Tamannaah : త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న తమన్నా.. వరుడు ఎవరో, ఏం చేస్తాడో తెలుసా..?

Tamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. భారీ చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. బాహుబలి తర్వాత తమన్నాకు భారీ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేసిన తమన్నా ప్రస్తుతం వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తోంది. అటు బాలీవుడ్ లోనూ వరుస ప్రాజెక్ట్ లను సొంతం చేసుకుంటోంది. తమన్నా అందాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఇంత వయసు వచ్చినా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. తమన్నా వెండితెరకు పరిచయమై 17 ఏళ్లు గడిచినా.. ఫేమ్, పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు.

అయితే తమన్నా పెళ్లి‌పై ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మిల్కీ బ్యూటీ పెళ్లికి సంబంధించిన చాలా వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టగా.. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదని సున్నితంగా సమాధానం ఇవ్వడంతో ఆ రూమర్స్ కు చెక్ పడేవి. తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈసారి తమన్నా తన పెళ్లి వార్తలపై స్పందించకపోవడంతో.. అవి నిజమే అని అర్ధమవుతోంది. తమన్నా త్వరలో ముంబైకి చెందిన ఓ యువ వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్దమయిందని ఆ వార్తల సారాంశం.

Tamannaah reportedly getting married soon
Tamannaah

అందులో భాగంగా ప్రస్తుతం సినిమాలను కూడా తగ్గించేశారని కొందరు అంటున్నారు. కొన్ని రోజుల క్రితమే మిల్కీ బ్యూటీ తన పెళ్లికి ఓకే చెప్పారట. పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో. తన పెళ్లి నిర్ణయం తల్లిదండ్రులకే వదిలేసినట్లు ఎన్నోసార్లు తమన్నా చెప్పింది. ఇప్పుడు కూడా పెద్దలు తీసుకొచ్చిన అబ్బాయికే ఓకే చెప్పారట. ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ భోళా శంకర్, అలాగే సత్యదేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం మూవీలో నటిస్తుంది. వీటిలో పాటు ఒక హిందీ, మరొక మలయాళ చిత్రంలో కూడా చేస్తుంది.

Share
Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago