Yashoda Movie : టాలీవుడ్ టాప్ హీరోయిన్ తాజా చిత్రం యశోద. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల భారీ వసూళ్లను సాధిస్తున్నది. యశోద చిత్రం 5వ రోజున దేశవ్యాప్తంగా 464 పట్టణాల్లో 1052 సినిమా హాళ్లలో ప్రదర్శించారు. తెలుగులో 77 వేలకుపైగా ప్రదర్శనలు, హిందీలో 13 వేలు, తమిళంలో 11 వేలు, మలయాళంలో 502 స్క్రీన్లలో ప్రదర్శించారు. తొమ్మిది చోట్ల హౌస్‌ఫుల్స్ కాగా, మిగితా చోట్ల సగటున 20 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. అయితే యశోద చిత్రంపై కృష్ణ మరణం కాస్త ఎఫెక్ట్ చూపించినట్టు తెలుస్తుంది.
మొత్తం మీద 36 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా వరల్డ్ వైడ్ గా 69 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక సినిమా మొత్తం మీద 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… నైజాం 20 లక్షలు, సీడెడ్.. 3 లక్షలు, యూఏ 4లక్షలు, ఈస్ట్ 2 లక్షలు, వెస్ట్ లక్ష, గుంటూరు రెండు లక్షలు, కృష్ణ మూడు లక్షలు, నెల్లూరు లక్ష.. మొత్తం మీద 36 లక్షల షేర్ రాబట్టింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 12 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 5 రోజుల తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 1.93 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.
తెలుగు రాష్ట్రాలలో తొలి రోజు 1.63Cr, రెండో రోజు – 1.76Cr, మూడో రోజు – 1.58Cr, నాలుగో రోజు – 69L, ఐదో రోజు – 36L రాబట్టింది.తమిళంలో 80 లక్షలు, కర్ణాటక మరియు రెస్టాఆఫ్ ఇండియా 95 లక్షలు, ఓవర్సీస్ 2.30 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా 10.07 కోట్ల షేర్ రాబట్టింది. అమెరికాలో ఈ చిత్రం దూసుకుపోతుంది. ఈ సినిమా గత ఐరు రోజుల్లో 500k వసూళ్లను నమోదు చేసింది. మంగళవారం ఈ చిత్రం ఈ ఫీట్ సాధించింది. 165 లోకేషన్లలో యశోద చిత్రం $41,053 రాబట్టింది. దాంతో ఈ చిత్రం 500K క్లబ్‌లో చేరింది. రానున్న రోజుల్లో 1 మిలియన్ క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…