Tamannaah : సినీ సెలబ్రిటీలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అన్నీ ఇన్నీ కావు. ప్రేమ, పెళ్లి, డేటింగ్‌కి సంబంధించి ఎన్నో పుకార్లు పుట్టిస్తుంటారు. తమన్నా పెళ్లికి సంబంధించి కొన్నాళ్లుగా తెగ ప్రచారాలు నడుస్తున్నాయి. ఆ మధ్య బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో తమన్నాకు పెళ్లి ఫిక్స్ అయిందని వార్తలు వచ్చాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ అబ్బాయిని తమన్నా వివాహమాడనుందని వార్తలు రాగా, ఆ పెళ్లి వార్తలపై బహిరంగంగా స్పందించింది తమన్నా భాటియా. అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. కొద్ది రోజుల తర్వాత ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో వివాహ బంధానికి సిద్ధమైందని వార్తలు వచ్చాయి.
ముంబైకి చెందిన ఓ యంగ్ బిజినెస్ మ్యాన్ తో మిల్కీ బ్యూటి తమన్నా ఓకే చెప్పేసిందని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందన్న వార్తలు తెగ షికారు చేస్తున్నాయి. ఇలా అడపాదడపా తమన్నా పెళ్లికి సంబంధించి ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. నిజానికి సోషల్ మీడియాలో కొందరు నా పెళ్లిని ఎప్పుడో చేసేశారు. ఓసారి డాక్టర్ అన్నారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అని అంటున్నారు. అయితే అవన్నీ నిజాలు మాత్రం కావు. నేను నిజంగా పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాను. సాధారణంగా అందరి ఇళ్లలో మాదిరిగానే మా ఇంట్లోనూ నన్ను పెళ్లి చేసుకోమని ప్రెషర్ పెడుతున్నారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
అయితే ఇంకా నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. నేను రూమర్స్‌ను పట్టించుకోను. సోషల్ మీడియాలో వచ్చే న్యూస్‌ను పట్టించుకోను’’ అని తెలియజేసింది మిల్కీబ్యూటీ తమన్నా.డిసెంబర్ 9న ఈ అమ్మడు గుర్తుందా శీతాకాలం సినిమాతో పలకరించనుది. ఇంకా తను చేయబోతున్నమరో సినిమా భోళా శంకర్. ఈ సినిమా గురించి కూడా తాజాగా తమన్నా తెలియజేసింది. వచ్చే నెలలో సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని ఆమె తెలిపారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…