Kooman Review : దృశ్యం డైరెక్ట‌ర్.. కూమ‌న్ థ్రిల్ల‌ర్ మూవీ రివ్యూ..

Kooman Review : దృశ్యం సినిమాని తెర‌కెక్కించిన జీతూ జోసెఫ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం కూన‌మ్. థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన ఈ చిత్రం నేడు ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంద‌నేది చూద్దాం.

కథ:

గిరి(అసిఫ్ అలీ), తమిళనాడు-కేరళ బోర్డర్ లోని సొంతూరిలో కానిస్టేబుల్ గా వ‌ర్క్ చేస్తాడు. అత‌ను ఏ కేసు అయిన చాలా తెలివిగా సాల్వ్ చేస్తుంటాడు. అయితే అత‌నిని కొత్త‌గా వ‌చ్చిన సీఐ ఓ సారి బుర‌ద‌లో తోసేయ‌డంతో అత‌నిపై ప‌గ తీర్చుకోవాల‌ని పగలు పోలీసుగా, రాత్రుళ్లు తన ఊరిలోనే దొంగతనాలు చేస్తూ రెచ్చిపోతాడు. ఓ సారి గిరి ఓ ఇంటి యజమానికి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. కట్ చేస్తే తర్వాత రోజు ఉదయానికి సదరు వ్యక్తి.. చెట్టుకు వేలాడుతూ కనిపిస్తాడు. అలాంటివి వ‌రుస‌గా జ‌రుగుతాయి. ఆ త‌ర్వాత క‌థ‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

Kooman Review in telugu must watch movie
Kooman Review

ప‌ర్‌ఫార్మెన్స్:

ఈ సినిమాలో హీరోగా చేసిన అసీఫ్ అలీ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. స్టోరీ మొత్తం దాదాపు అతడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మిగిలిన పాత్రలు చేసిన అందరూ కూడా వాటికి తగ్గ న్యాయం చేశారు. ఇక టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ.. సినిమా మూడ్ ని ఎలివేట్ చేస్తూ వెళ్లాయి. ఇక డైరెక్టర్ జీతూ జోసెఫ్.. తనకు అలవాటైన రీతిలో మరో క్రేజ్ థ్రిల్లర్ ని ప్రేక్షకులకు అందించాడు.

ప్లస్ పాయింట్స్:

  • ఆస‌క్తి రేకెత్తించే ట్విస్టులు
  • అసిఫ్ అలీ యాక్టింగ్
  • జీతూ జోసెఫ్ డైరెక్షన్

మైనస్ పాయింట్స్:

  • కొన్ని కామ‌న్ సీన్స్
  • తెలుగులో లేక‌పోవ‌డం

విశ్లేషణ‌:

కూమ‌న్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తాజాగా రిలీజ్ కాగా, . మలయాళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో సీన్ సీన్ చాలా ఆస‌క్తి రేపుతుంది. ఓ సీనియర్ దొంగని మచ్చిక చేసుకున్న కానిస్టేబుల్, అతడి దగ్గర దొంగతనానికి సంబంధించిన చాలా టెక్నిక్స్ తెలుసుకోవ‌డం, తనతో పనిచేస్తున్న పోలీసులనే ముప్పతిప్పలు పెడత‌డం, ప్ర‌తి సీన్‌లో ఆడియ‌న్స్‌ని టెన్ష‌న్ పెట్ట‌డం చాలా బాగుంది.ఇంటర్వెల్ తర్వాత పూర్తిగా స్టోరీ మారిపోతుంది. మర్డరీ మిస్టరీల వైపు వెళ్ల‌గా, కిల్లర్ ఎవరనేది చివరి వరకు అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేం.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago