Avatar 2 First Review : అవతార్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2009 చివర్లో డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్’ చిత్రం విడుదలైంది. రెండో ఆట ముగిసేసరికి సంచలనం సృష్టించిన ఈ చిత్రం మూడు రోజులు దాటకముందే రికార్డుల మోత మొదలు పెట్టంది.. పదమూడేండ్లు గడుస్తున్నా.. ‘అవతార్’ విశ్వరూపాన్ని మర్చిపోలేకపోతున్నాం. అంతలా అలరించింది ఈ హాలీవుడ్ సినిమా. అవతార్ మొత్తం ఐదు ఫ్రాంచైజీలుగా రానుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే సెకండ్ పార్ట్ కోసం అవతార్ అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తుండగా.. మొత్తానికి ఈ నెల 16న ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్థమైంది.
ఇండియాలోనూ అత్యధిక స్క్రీన్స్‌లో అవతార్ 2 భారీ ఎత్తున విడుదల కానుండగా.. ఇప్పటికే 2 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుక్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా $2 బిలియన్ల బ్రేక్‌ఈవెన్ టార్గెట్‌తో థియేటర్‌లలోకి ఈ సినిమా రాబోతుంది. అవతార్ 2 ప్రీమియర్ లండన్‌లో జరగగా, మూవీకి సంబంధించిన రివ్యూలు బయటకు వస్తున్నాయి. లండన్‌లో జరిగిన వరల్ద్ ప్రీమియర్‌లో ఈ చిత్రాన్ని వీక్షించిన పలువురు ఫిలిం క్రిటిక్స్, సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా సినిమా గురించి ప్రశంసించారు.
జేమ్స్ కామెరాన్ దర్శకత్వ ప్రతిభ గురించి ఇప్ప్రటికే పంచమంతా తెలిసినప్పటికీ.. ఈ విజువల్స్ అందరి అంచనాలకు అందనంత ఎత్తులో అద్భుతంగా ఫ్రేమ్ చేయబడ్డాయని తెలిపారు. విజువల్‌గా చాలా అద్భుతంగా ఉందని , ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయని గిజ్‌మోడోకు చెందిన జర్మైన్ లూసియర్ ట్వీట్ చేశాడు. ముఖ్యంగా పిల్లలందరి పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుందని అన్నారు. కొందరు ఈ చిత్రాన్ని సినిమాటిక్ మాస్టర్ పీస్‌గా వర్ణించాడు. మొదటి భాగం కంటే ఎక్కువ ఆనందించానని.. ఆన్-స్క్రీన్‌పై అద్భుతమైన విజువల్స్‌తో మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. వీఎఫ్ఎక్ , సీజీఐ పీక్స్‌లో ఉన్నాయట. పండోర అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయట. 3 గంటల 10 నిమిషాలు ఉన్న ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…