Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా హంగామా ఇప్పుడు మాములుగా లేదు. ఒక వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ తెగ బిజీగా మారింది. ఇప్పుడు ఈ అమ్మడు కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలతోను సినిమలు చేస్తుంది. ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన తమన్నా డ్యాన్స్ స్టెప్స్‌తో తెరకెక్కిన ‘కావాలయ్యా.. కావాలయ్యా’ అనే పాట ప్రోమోనే వైరల్‌గా మారింది. ఈ పాట సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ‘జైలర్’ చిత్రంలోనిది కాగా, పాటకి తమన్నా అదిరిపోయే డ్యాన్స్ చేసింది. తనదైన స్టెప్పులతో, కిల్లింగ్ లుక్స్ తో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది మిల్కీ బ్యూటీ.
ఇక సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో.. మూవీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా బాలీవుడ్ లో సందడి చేస్తోంది అందాల భామ. తాజాగా జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో తమ్ము బేబీ మరోసారి తన స్టెప్పులతో అభిమానులను అలరించింది. నువ్ కావాలయ్య పాటకు స్టేజిపై తనదైన డ్యాన్స్ తో దుమ్మురేపింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమన్నా కేక పెట్టించే అందాలు చూపిస్తూ డ్యాన్స్ తో రచ్చ చేసింది. తమన్నా డ్యాన్స్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన అప్లాజ్ వస్తుంది.
‘జైలర్’ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. సుమారు రూ .200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, పాటలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో.. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిపోయాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…