Talasani Srinivas Yadav : మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌పై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే కేసులు నమోదు చేసి జైల్లో పెట్టించారని ఇప్పటికే తెలంగాణ కు చెందిన కొందరు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తెలిపారు. తాజాగా మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈవిషయంలో తన విచారాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా పోస్ట్ పెట్టారు తెలంగాణ మంత్రి. చంద్రబాబు అరెస్ట్ తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గంలో తలసాని మంత్రిగా పని చేశారు. ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన నేత పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరైంది కాదని..అధికారం ఎవరికి శాశ్వతం కాదని ట్వీట్ చేశారు.
చంద్రబాబు అరెస్ట్ తనను వ్యక్తిగంతా బాధించిందని చెప్పిన తలసాని… ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన నాయకుడు .. ఆయనని 73ఏళ్ల వయసులో ఆయన్ని కేసుల పేరుతో జైల్లో పెట్టించడం విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. చంద్రబాబు పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరైంది కాదని తన కామెంట్ ద్వారా తెలియజేశారు తలసాని. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో మంత్రిగా పని చేశాను. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలగచేసింది అని చంద్రబాబు అన్నారు.
అధికారం శాశ్వతం కాదు. ఒకప్పుడు కేంద్ర రాజకీయాలల్లో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం. సుమారు 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు’’ అని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తలసాని చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…