Rohit Sharma : మ్యాచ్‌కి ముందే క‌లిసిన రోహిత్, బాబ‌ర్.. ఎంత ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకున్నారు..!

Rohit Sharma : వరల్డ్‌ కప్‌ మహా సంగ్రామం మొద‌లైంది. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 కోసం 10 జట్లు పోటీ పడుతున్నాయి. వీటిలో కొన్ని టీమ్స్‌ హాట్‌ ఫేవరేట్లుగా ఉన్నాయి. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో పాటు పాకిస్థాన్‌ సైతం వరల్డ్‌ కప్‌ రేసులో ముందు ఉందని చాలా మంది క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌, మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.. అయితే.. పాకిస్థాన్‌ టీమ్‌ చాలా కాలంగా ఇండియాకు రాలేదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదనే విషయం తెలిసిందే. కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లోనే ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి. అయితే.. ఈ సారి వరల్డ్‌ కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండటంతో.. పాకిస్థాన్‌ జట్టు సైతం భారత గడ్డపై అడుగుపెట్టింది.

45 రోజులపాటు క్రికెట్ ప్రేమికులను ప్రపంచకప్ అలరించనుంది. ప్రతిరోజూ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులను ఆనందంలో మంచెత్తనుంది. అయితే ప్రపంచకప్ ప్రారంభానికి ఒక రోజు అహ్మదాబాద్‌లో 10 జట్ల కెప్టెన్లు కలుసుకున్నారు. కెప్టెన్స్ డే కార్యక్రమంలో అన్ని జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ సైతం కలుసుకున్నారు. ఒకరినొకరు కలుసుకుని అప్యాయంగా పలకరించుకోగా, ఈ కార్యక్రమంలో కెప్టెన్లందరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అలాగే ప్రపంచకప్‌ను ఉద్దేశించి మాట్లాడారు.

Rohit Sharma and babar azam met during match
Rohit Sharma

అంతకుముందు అహ్మదాబాద్ చేరుకున్న అన్ని జట్ల కెప్టెన్లకు ఘనస్వాగతం లభించింది. ఇక టోర్నీలో అత్యంత ఆసక్తికరమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఈ నెల 14న జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఒక్క టీమిండియా తప్ప అన్ని జట్లు వార్మప్ మ్యాచ్​లు ఆడాయి. భారత్ ఆడాల్సిన రెండు మ్యాచ్​లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే రోహిత్ సేన వరల్డ్ కప్​కు వెళ్తోంది. కెప్టెన్స్ రౌండ్ టేబుల్ ఈవెంట్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అయితే ఈ ఈవెంట్​లో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఒక జోక్ కూడా వేసి అందర్నీ నవ్వించాడు. ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్టుల్లో ఒకరు హిట్​మ్యాన్​ను ఓ ప్రశ్న అడిగారు.

గత వరల్డ్ కప్​ ఫైనల్​లో న్యూజిలాండ్-ఇంగ్లండ్ మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ కూడా టై అయింది. దీంతో బౌండరీల కౌంట్ ద్వారా ఇంగ్లీష్ టీమ్​ను విజేతగా నిర్ణయించారు. ఇదే విషయాన్ని రోహిత్​కు గుర్తుచేసిన ఆ జర్నలిస్ట్.. ఇంగ్లండ్​తో పాటు న్యూజిలాండ్​ను కూడా కలిపి సంయుక్తంగా విన్నర్​గా ప్రకటిస్తే బాగుండేదన్నారు.ఇదే విషయంపై మీ అభిప్రాయం ఏంటని రోహిత్​ను అడిగారు జర్నలిస్ట్. దీంతో ఇది తనకు వేయాల్సిన ప్రశ్నేనా అంటూ నవ్వాడు రోహిత్. విజేత ఎవరో నిర్ణయించడం, ప్రకటించడం తన చేతుల్లో లేని పని అని అంటూ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చాడు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago