Honey : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి తేనెను ఉపయోగిస్తున్నారు. దీన్ని వంటల్లో వేయడం మాత్రమే కాదు.. నేరుగా కూడా తింటారు. అలాగే ఆయుర్వేదంలోనూ తేనెకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దీన్ని అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే అనేక వ్యాధులకు ఇది ఔషధంగా పనిచేస్తుంది. అయితే తేనెను ప్రతి రోజూ తీసుకోవాలి. దీంతో అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. తేనెను తీసుకోవడం వల్ల కేవలం పోషకాలు లభించడమే కాదు.. శక్తి కూడా వస్తుంది. అలాగే వ్యాధులు కూడా నయమవుతాయి. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనెను కలిపి తాగాలి. లేదా రాత్రి నిద్రకు ముందు తాగాలి. దీంతో అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ తేనెను ఇలా తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా తేనెలో ఉంటాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం ఉండవు. తేనెను తీసుకోవడం వల్ల గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. తేనెను తీసుకుంటే శరీరంలో ఉండే కొవ్వు మొత్తం కరుగుతుంది. ఇది అధిక బరువు ఉన్నవారికి మేలు చేస్తుంది. తేనె వల్ల శరీరంలోని కణాలు ఉత్తేజం అవుతాయి. దీంతో చురుగ్గా మారుతారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. నీరసం, అలసట ఉండవు. తక్కువ పని చేసినా అలసిపోతున్నాం అనుకునేవారు ఇలా తేనెను రోజూ తీసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది.
తేనెను తీసుకోవడం వల్ల రక్తనాళాలు శుభ్రమవుతాయి. దీంతో రక్తసరఫరా మెరుగు పడుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఇలా తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. తేనె వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఆకలి సరిగ్గా అవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్, మలబద్దకం, అసిడిటీ ఉండవు. ఇలా తేనెతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక దీన్ని రోజూ తీసుకోవాలి. కాలాలతో సంబంధం లేకుండా ఏ సీజన్‌లో అయినా సరే తేనెను తీసుకోవచ్చు. ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. కనుక తేనెను రోజూ తీసుకోవడం మరిచిపోకండి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…