Taapsee : ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించి ఆ తర్వాత పలు ఆఫర్స్ అందుకున్న తాప్సీ టాలీవుడ్‌లో పెద్దగా రాణించలేకపోయింది. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ మాత్రం మంచి మంచి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అనంతరం సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టుకుని పలు సినిమాలు కూడా తీసింది. చివరగా తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే మూవీలో కనిపించిన తాప్సీ.. తాజాగా ఓ ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచింది.
మిస్ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొన్నప్పుడు అక్కడి రాజకీయాలు చూసి చిరాకు కలిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.చాలా మందికి నేను మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న విషయం తెలియదు. కాంటెస్ట్ సమయంలో నాది ఉంగరాలు జుట్టు అంటూ అక్కడి వారు హేళన చేశారు. కార్పొరేట్ సంస్థలకు చెందిన కొందరు నా దగ్గరకు వచ్చి ఒకవేళ మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంటే తమ సంస్థల తరపున మూడేళ్ల పాటు పనిచేయాలని, ముప్పై శాతం ఆదాయాన్ని ఇవ్వాల్సి ఉంటుందని భయపెట్టారని, ఆ రోజుల్ని తలచుకుంటే ఓ పీడకలలా అనిపిస్తుంది అని తాప్సీ చెప్పుకొచ్చింది.
ఇక హీరోయిన్‌గా ఉండేందుకు చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాను. ఒక్కో సినిమా కోసం ఒక్కోలా మారాల్సి ఉంటుంది కాబట్టి బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు డైటీషియన్ ని పెట్టుకున్నాను. ప్రతినెలా దాదాపు డైటీషియన్ కోసం లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాను. ఈ విషయమై అమ్మనాన్న ఎప్పుడూ నన్నూ తిడుతూనే ఉంటారు. చిన్నప్పుడు ఫాదర్స్ డే పెన్ కొని నాన్నకే ఇస్తే, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావని నన్ను తిట్టారు. వారు ఇప్పటికీ ఏం మారలేదు. అయితే ఇప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో నాకు తెలియదు అందుకే డైటీషియన్ కోసం అంత ఖర్చు పెట్టాల్సి వస్తోంది.’ అని తాప్సీ చెప్పుకొచ్చింది.