T20 World Cup 2024 : ఐపీఎల్ 2024 సగం పూర్తయింది. ఈలోగానే టీ20 ప్రపంచకప్ స్క్వాడ్‌పై గుసగుసలు మొదలయ్యాయి. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ ఇండియా జట్టు మే 1న ప్రకటించనుంది బీసీసీఐ. అయితే ఇప్పటికే సెలెక్టర్లు 20 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అందులో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్, హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ పేర్లు లేవని సమాచారం. 15 మంది ప్రధాన ఆటగాళ్లు, 5 స్టాండ్ బై ప్లేయర్ల లిస్టు బీసీసీఐ సిద్దం చేసినట్టు తెలుస్తుంది ఇందులో 6 మంది స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్లుగా ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్‌తో ఈ లిస్టు గట్టిగా ఉండగా.. ఆల్‌రౌండర్ల కోటాను రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే భర్తీ చేయనున్నారు.
అయితే శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లలో ఒకరికి మాత్రమే జట్టులో చోటు దక్కే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. అయితే లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి జైస్వాల్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మంచి ఫినిషర్‌ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తే కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ శివమ్ దూబేలలో ఒకరు జట్టులోకి రావచ్చు. వికెట్ కీపర్ల విషయంలోనూ తీవ్ర పోటీ నెలకొంది. సంజూ శాంసన్, జితేష్ శర్మ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లు జట్టులో చోటు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఒక కీపర్‌గా రిషభ్ పంత్‌ను జట్టులోకీ తీసుకోవడం ఖాయం కాబట్టి ఆ రెండో బెర్తు ఎవరు దక్కించుకుంటారో అన్న ఉత్కంఠ కలుగుతోంది. ఇక హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్.. సెలక్షన్ కమిటీని ఆందోళన పరుస్తోంది. కెప్టెన్‌గానే కాకుండా బౌలర్‌గా, బ్యాటర్‌గా అన్ని రకాలుగా కూడా దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. అతని స్థానంపై సస్పెన్స్ నెలకొంది.
ఇక విరాట్ కోహ్లీని పొట్టి ప్రపంచకప్‌కు ఎంపిక చేయడం లాంఛనమే. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ పేర్లు ఖరారైనట్లే. స్పిన్నర్ల విషయంలో యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. రాహుల్ తెవాటియా మంచి ఫినిషర్ అయినా అతడికి జట్టులో చోటు కష్టమే కావచ్చు. రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా, నితీశ్‌రెడ్డి వంటి యువ ఆటగాళ్లు ఈ ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేస్తున్నా కూడా టీ 20 ప్రపంచకప్‌లో వీరికి స్థానం దక్కడమ కష్టమే అన్న వార్తలు వస్తున్నాయి. రియాన్ పరాగ్‌కు రానున్న టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్ ఇచ్చే విషయంపై రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, అజిత్ అగార్కర్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…