Akshay Kumar : మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ అండ్ మైథలాజికల్ డ్రామా ‘కన్నప్పరూపొందుతుండగా… ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటీ… అనేది ఉపశీర్షిక. భారతీయ ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమాకు పేరు తీసుకొచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పలు భాషలకి చెందిన ఎంతో మంది స్టార్స్ భాగం అవుతున్నారు. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ కూడా భాగం అవుతున్నారని మంచు విష్ణు తెలియజేశారు. తెలుగు ప్రేక్షకులకు అక్షయ్ కుమార్ తెలుసు. ఆయన సినిమాలు తెలుగులో అనువాదం అయ్యాయి. విజయాలు సాధించాయి.
అయితే, ఇప్పటి వరకు ఆయన స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయలేదు. ‘కన్నప్ప’తో తెలుగు చిత్రసీమకు అక్షయ్ కుమార్ పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు నటిస్తున్నారని తెలుస్తోంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్ నటులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తారని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ శివుడిగా.. నయనతార పార్వతిగా కనిపించనున్నారని టాక్ నడిచింది.
కాని తాజా సమాచారం ప్రకారం ఇందులో అక్షయ్ శివుడిగా కనిపించనున్నట్టు టాక్. ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో మహావిష్ణువు అంశతో కూడిన భైరవ అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. అయితే ఇప్పుడు కన్నప్ప సినిమాలో శివుడిగా కనిపిస్తే ఇబ్బంది కలుగుతుందని ప్రభాస్ చెప్పడంతో మంచు విష్ణు క్యారెక్టర్స్ లో మార్పులు చేశారట. దాంతో మంచు విష్ణు అక్షయ్ కుమార్ ను రంగంలోకి దింపారు. ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ లో కూడా అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించి అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన శివుడిగా కనిపించబోతున్నాడు అనేసరికి ఆశ్చర్యపోతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…