Rohit Sharma : రోహిత్ శర్మ గురించి క్రికెట్ ప్రియులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతనిని అందరు హిట్‌మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. రోహిత్ గ్రౌండ్‌లోకి దిగాడంటే బౌండరీల మోత మోగాల్సిందే. బౌలర్ల గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. ఈయన ప్రస్తుతం ఇండియన్ టీంలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరు. ఇండియన్ టీంలో రోహిత్ శర్మ టాలెంటెడ్ ఓపెనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అతని కెప్టెన్సీలో భారత్ వన్డే వరల్డ్ కప్ దక్కించుకోవాల్సి ఉన్న ఒక్క మ్యాచ్‌తో చేజారిపోయింది. ఈ సారి టీ20 పోరుకి సిద్ధమవుతుంది రోహిత్ నాయకత్వంలోని భారత జట్టు. టీ20 వరల్డ్ కప్ దక్కించుకోవాలని రోహిత్ కడా ఎంతో కసిగా ఉన్నాడు. ఇక రోహిత్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆయన ధనవంతులైన భారత క్రికెటర్ల జాబితాలో ఒకరు.
రోహిత్ హుబ్లోట్ యొక్క బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా, ఆయన దగ్గర హుబ్లోట్ బ్రాండ్ వారి వాచ్ లు చాలానే ఉన్నాయి. హబ్లోట్ క్లాసిక్ వాచ్ ను కూడా రోహిత్ శర్మ సొంతం చేసుకున్నారు. దీని ఖరీదు అక్షరాలా ఐదు లక్షల రూపాయలు. ఇక అతను ఆరు లక్షల విలువైన హబ్లోట్ క్లాసిక్ బ్లూ ని కూడా కలిగి ఉన్నాడు. ఇది క్రోనోగ్రాఫ్ టైటానియం ఎడిషన్. మాజీ ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తర్వాత రోహిత్ దగ్గరే ఇది ఉంది. ఇక మారుతి విటారా బ్రెజ్జా రోహిత్ కొనుగోలు చేయగా, దాని విలువల అక్షరాలా 10 లక్షలు.రోహిత్ శర్మ ఫుల్ షాట్ ఆడడాన్ని ఎంత ప్రేమిస్తాడో.. కార్లను అంతకంటే ఎక్కువ గా ప్రేమిస్తాడు. రోహిత్ శర్మ కార్ల జాబితా చాలానే ఉంది. ఇరవై లక్షల రూపాయలు ఖరీదు చేసే స్కోడా లారా ను కూడా రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు.
రోహిత్ శర్మ వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వాటిలో హుబ్లోట్ ఫెరారీ యునికో మ్యాజిక్ గోల్డ్ వాచ్ ఒకటి. దీని ఖరీదు 27.8 లక్షలు. 2018 లో రోహిత్ తన పుట్టిన రోజు సందర్భం గా దీన్ని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్‌లో సీఎస్‌కేను ఓడించిన తర్వాతే ఇది అతని సొంతమైంది. BMW 350I మోడల్ ఖరీదైన కారు రోహిత్ వద్ద ఉండగా, దాని ఖరీదు – 80 లక్షలు . మెర్సిడెస్ జిఎల్ఎస్ 350 డి కారు కూడా రోహిత్ వద్ద ఉంది. దాని ఖరీదు 95 లక్షలు. ఇక రోహిత్ వద్ద ఉన్న ఈ BMW M5 కి చాలా ప్రత్యేకత ఉంది. ఇది ఎం ట్విన్‌పవర్ టర్బో, రోడ్ రోస్టింగ్ ఇంజన్ సెట్ మరియు ఎనిమిది సిలిండర్ల ఇంజిన్‌తో నిండి ఉంది. ఇది తన డ్రీం కార్ అని రోహిత్ కెరీర్ తొలినాళ్లలో ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు. దీని ధర 1.33 కోట్ల రూపాయలు. ఇక ఎ-గ్రేడ్ హాలిడే హోమ్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఓ నివేదిక తెలుపుతోంది. ఇక ముంబైలోని రోషిత్ శర్మ ఇల్లు, సీసైడ్ వర్లీ అపార్ట్‌మెంట్ విలువ రూ. 30 కోట్లు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…