Manchu Vishnu : మ‌ళ్లీ ట్రోల‌ర్స్‌కి దొరికిన మంచు విష్ణు.. ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా..!

Manchu Vishnu : మంచు ఫ్యామిలీపై ఇటీవ‌ల ట్రోలింగ్ ఎక్కువ‌గా న‌డుస్తుంది. విష్ణు, మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మీ ఇలా ప్ర‌తి ఒక్క‌రిపై ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా ట్రోలింగ్ న‌డుస్తూనే ఉంటుంది. ఇటీవ‌ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జ‌ర‌గ‌గా, ఈ మీటింగ్‌లో అనేక విషయాలు చర్చల్లోకి వచ్చాయి. ‘మా’ బిల్డింగ్ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మంచు విష్ణు కార్యవర్గం మరికొంతకాలం కొనసాగుతుందని ఏకగ్రీవంగా తీర్మానించారు. సుమారు 400 మంది ‘మా’ సభ్యులు హాజరైన ఈ సమావేశంలో… మేలో జరగబోయే ఎన్నికలు, జులైలో జరగనున్న నిధుల సేకరణ కార్యక్రమం, ‘మా’ భవన నిర్మాణంలో కొనసాగుతున్న వివిధ ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు.

‘మా’ భవనం విజయవంతంగా పూర్తయ్యే వరకు అధ్యక్షుడు విష్ణు మంచు నేతృత్వంలోని ప్రస్తుత కమిటీ పదవీకాలాన్ని పొడిగించాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనకు ప్రస్తుత సభ్యులందరి నుంచి ఏకగ్రీవ మద్దతు లభించింది. తమపై ఇంతటి విశ్వాసాన్ని ఉంచిన సభ్యులందరికీ మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ప్యానెల్ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తనకు, తన ప్యానెల్‌కు అప్పగించిన బాధ్యతను గుర్తించి ‘మా’ సభ్యులందరి అభివృద్ధి, సంక్షేమం కోసం పాటు పడతామని ప్రతిజ్ఞ చేశారు. అయితే మంచు విష్ణు చేసిన కామెంట్స్‌పై ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. ఇంత‌క ముందే ఏం చేయ‌లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటూ సెటైర్ పేలుస్తున్నారు.

netizen troll Manchu Vishnu for his latest comments
Manchu Vishnu

మంచు ఫ్యామిలీ ప్రెస్టీజియస్ గా భావించి తీస్తున్న సినిమా కన్నప్ప . మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం ఇప్పటికే ఉత్తర, దక్షణాది భాషల్లో నటించే స్టార్ నటులను సెలక్ట్ చేసి వారికి తగిన పాత్రలు డిజైన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మూవీ కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరో పని చేస్తున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. కన్నప్ప మూవీలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక అక్షయ్ తో విష్ణు, మోహన్ బాబు కలిసి మాట్లాడిన వీడియోని తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేశాడు. ఇప్పటికే ఈసినిమా కోసం భారీ తారాగణాన్ని సెలక్ట్ చేసుకున్న నిర్మాత మోహన్ బాబు.. సినిమా రిజల్ట్స్ మాత్రం భారీగానే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్యాన్ ఇండియాను మించిన సినిమా అవ్వాలని కోరుకుంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago